యానాం మద్యం సీసాలు మరియు హుందాయ్ అసెంట్ కారు స్వాధీనం.

    జిల్లా పోలీసు కార్యాలయం, కాకినాడ (ప్రజా అమరావతి)


 బహిరంగ మార్కెట్లో సుమారు రూ.1,50, 000/- (లక్ష యాబై వేల రూపాయలు)  విలువ గల 181 యానాం మద్యం సీసాలు మరియు హుందాయ్ అసెంట్ కారు  స్వాధీనం. 



ఎ.పి ఎక్సైజ్ యాక్టు క్రింద కాకినాడ సౌత్ సెబ్ స్టేషన్ నందు కేసు నమోదు.


కాకినాడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ M. రవీంద్రనాధ్ బాబు, IPS గారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో & అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్) శ్రీ పి. శ్రీనివాస్ వారి ఆధ్యర్యంలో  ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్, కాకినాడ సౌత్ సెబ్ స్టేషన్ కాకినాడ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సెబ్, మరియు సిబ్బంది ది. 13-03-2023 న హుందాయ్ అసెంట్ కారులో యానాం నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యం ను ఘాటి సెంటర్, కాకినాడ నందు సెబ్ అధికారులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, వేరు వేరు బ్రాండ్ లకు చెందిన 2 లీటర్ల, 750 ML, 375 ML, 180 ML మద్యం మరియు 650 ML, 500 ML బీర్  మొత్తం (181) బాటిల్ లను స్వాధీనపరచుకొని, రవాణా కు ఉపయోగించిన హుందాయ్ అసెంట్ కారు లో యానాం కు చెందిన A1. నటి రఘువంశీ (సప్లయిర్), A2. గుత్తుల రవికుమార్ (పార్టనర్) కరప మండలం, గొర్రిపూడి గ్రామానికి చెందిన A3. చీకట్ల శ్రీ హరి కృష్ణ (సెల్లర్) అను వారిని ఈరోజు  అరెస్ట్ చేయడం జరిగింది.

    

ఈ కేసు నందు సిబ్బంది ఎంతో చాకచక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి భారీ మొత్తంలో యానాంకు చెందిన అక్రమ  మద్యం పట్టుకోవడమే కాకుండా, ఈ కేసు నందు ముద్దాయిలను అరెస్ట్ చేయుటకు కృషి చేసిన డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో & అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్), శ్రీ పి. శ్రీనివాస్ వారి ఆధ్యర్యంలో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ (I/c), శ్రీ Ch. అజయ్ కుమార్ సింగ్,  ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కె. వెంకటేశ్వర స్వామి, పి. సునీల్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సెబ్ కాకినాడ మరియు సిబ్బంది ను జిల్లా SP శ్రీ M. రవీంద్రనాథ్ బాబు, IPS గారు అభినందించారు.

Comments