మైక్రో అబ్జర్వర్ ప్రతి ఓటరును గమనించాలి డిఆర్వో కొండయ్య

 మైక్రో అబ్జర్వర్ ప్రతి ఓటరును గమనించాలి

  డిఆర్వో కొండయ్యపుట్టపర్తి, మార్చి 07 (ప్రజా అమరావతి): మైక్రో అబ్జర్వర్ ప్రతి ఓటరును గమనించాలి అని డిఆర్ఓ కొండయ్య పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సాయి ఆరామం ఫంక్షన్ హాల్ నందు.ఈ నెల 13 న జరగనున్న ఎం.ఎల్.సి ఎన్నికల పోలింగ్ లో  మైక్రో అబ్జర్వర్లకి. కీలక బాద్యతలు ఉంటాయని  ఎన్నికల కమిషన్  రూపొందించిన  హ్యాండ్ బుక్ ను చదివి అర్థం చేసుకొని శిక్షణా సమయంలో సందేహాలను నివృత్తి చేసుకోవాలని  డిఆర్ఓ పేర్కొన్నారు.ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈ నెల 13 న  అనంతపురం –  కడప-  కర్నూల్ ఎం.ఎల్.సి. ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నదని, పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలని అన్నారు.  పోలింగ్ ముందు రోజు  ఈ నెల 12 న జిల్లాలోని పుట్టపర్తి లోని  చెన్నంపల్లి జడ్పీ హైస్కూల్ నందు పోలింగ్ సామగ్రి పంపిణీ వుంటుందని, సూచించిన సమయానికి ఆలస్యం లేకుండా చేరుకోవాల్సి వుటుందని అన్నారు. 100 మీటర్ల మార్కింగ్ ఏర్పాటు చూసుకోవాలని పోలింగ్ రోజు ఇతరులు ఎవ్వరు ఆ పరిధిలో లేకుండా చూడాలని అన్నారు. పోలింగ్ రోజు ఉదయం  7 గంటల కల్లా పోలింగ్ కేంద్రం లో ఏజంట్ల పాసులు పంపిణీ, సీటింగ్ ఏర్పాట్లు పూర్తి కావాలని 8  గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యేలా చూడాలని అన్నారు. పోలింగ్ బూత్ లో ఓటు వేసే ప్రక్రియ ఎవరికీ కనబడకుండా క్యాబిన్ ఏర్పాటు ఉండాలని, వెబ్ కెమరాలు కూడా ఆ విధంగా అమర్చాల్సి ఉంటుందని అన్నారు. పోలింగ్  స్లిప్పు, ఎన్నికల కమీషన్ సూచించిన ఏదేని గుర్తింపు కార్డు కలిగిన ఓటర్ కు బ్యాలెట్ అందించేటప్పుడు సరైన విధంగా బ్యాలెట్ మీరే మొదట నిలువు మడత, ఆపిదప అడ్డంగా మడతతో అందించి, ఓటరు  పెన్నుతో  అంకెలు వ్రాసిన అనంతరం బ్యాలెట్ ను అదే విధంగా మడత పెట్టి బ్యాలెట్ బాక్సులో వేయాలని సూచించాలని,పట్టభద్రుల ఎమ్మెల్సీకి, బ్యాలెట్ పేపర్ తెల్ల కలర్ లోను, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి పింక్ కలర్ లోను బ్యాలెట్ పేపర్స్ ఉంటుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే స్కెచ్ పెన్ మాత్రమే వాడాలి. బ్యాలెట్ పేపర్ నందు అంకి మాత్రమే వాడాలి. ఓటింగ్  వ్యవహారం అంతా రహస్యంగా ఉండాలి. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఉంటుంది.  పోలింగ్  నందుప్రతి అంశాన్ని  వీడియో తీయాలి. పోలింగ్ విధులలో పాల్గొన్న వారికి పోస్టల్ బ్యాలెట్ ఫామ్ నంబర్ 12 ఇవ్వడం జరుగుతుంది. పోలింగ్  సామాగ్రిపంపిణీ సమయంలో  మీకు ఐడెంటిటీ కార్డు అందజేయడం జరుగుతుంది. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని తెలియజేయాలి.చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ జరగాలని అన్నారు.  


ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివ రంగ ప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సాయినాథ్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Comments