టీబీ బారిన వ్యక్తులను గుర్తించండి .. చికిత్స అందించండి

 టీబీ బారిన వ్యక్తులను గుర్తించండి .. చికిత్స అందించండి



జిల్లా నుంచి టీబీ వ్యాధిని పాలత్రోలుదాం 


,** టీబీ వ్యాధి ఉన్నవారికి పౌష్టి కాహరం అందిద్దాం


- జిల్లా కలెక్టర్  బసంత కుమార్


టీబీ వ్యాధి రహిత జిల్లా దిశగా అడుగులు వేయడం లో ప్రజల మద్దతు, భాగస్వామ్యం అవ్వాల్సి ఉందని జిల్లా కలెక్టర్  బసంత్ కుమార్  విజ్ఞప్తి చేశారు.


శుక్రవారం ఉదయం స్థానిక  గణేష్ సర్కిల్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో కలెక్టర్  బసంత్ కుమార్  గణేష్ సర్కిల్ నందు జెండా ఊపి  ర్యాలీ ప్రారంభించారు, అధికారులు, విద్యార్థినిలు, స్వచ్ఛంధ సంస్థలు తదితరులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ, టీబీ వ్యాధి సోకిందని ఎవ్వరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. టీబీ లక్షణాలు ఉన్నవాళ్లు డాక్టర్ వద్దకు వెళ్ళి తగిన వైద్య చికిత్స, డాక్టర్ సలహా మేరకు  ఆహారం తీసుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యవంతులు అవ్వవచ్చు అన్నారు.  టీబీ బాధితులకు ఆరోగ్యవంత మైన వారీగా తీర్చి దిద్ది జిల్లా నుంచి టీబీ ని శాశ్వతంగా పాలత్రోలుదాం అని పేర్కొన్నారు. 

 ఇందులో భాగంగా ముఖ్య అతిథులు ఇన్చార్జి DMHO Dr.Selvia Salman DLAT Officer Dr.G.Thippaiah DPMO Dr.K.C.Kullayappa Naik  DCHS Dr.Thippendra Naik PHC Medical ఆఫీసర్స్ డాక్టర్ నాగరాజు నాయక్ డాక్టర్ ఫణీంద్ర మరియు NTEP,వైద్య సిబ్బంది,School Students ర్యాలీలో పాల్గొనడం జరిగింది 



Comments