వేపాడకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే రావి ఎన్నికల ప్రచారం.

 *- వేపాడకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే రావి ఎన్నికల ప్రచారం* 


 *- భీమిలి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు* 

 *- ఉపాధ్యాయులు, ఉద్యోగులను కలిసి ఓట్ల అభ్యర్ధన* 

 *- నిరుద్యోగ పట్టభద్రులను ఆకట్టుకునేలా ప్రసంగాలు*

 *- ఎమ్మెల్సీ అభ్యర్ధి వేపాడను గెల్పించుకుంటామన్న రావి*



భీమిలి / విశాఖ, మార్చి 5 (ప్రజా అమరావతి): ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు మద్దతుగా భీమిలి నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు, కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సోమవారం భీమిలి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి కోరాడ రాజబాబు, ఇతర ముఖ్యనేతలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. అనందపురం మండలం బోయిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను కలిశారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు ప్రథమ ప్రాధాన్యతా ఓటు వేసి గెల్పించాలని అభ్యర్థించారు. అలాగే వెల్లంకి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయ సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న వేపాడకు మద్దతివ్వాలని కోరారు. ఆనందపురం గ్రామంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులతో మాట్లాడారు. వేపాడను గెల్పిస్తే ఉపాధ్యాయుల వాణిని శాసనమండలిలో వినిపించే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతకు ముందు 5వ డివిజన్ మధురవాడ, వైఎస్సార్ కాలనీలో పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్ధించారు. అలాగే 6వ డివిజన్, కొమ్మాది క్రాస్ లో ఉన్న వసంత విహార్ అపార్ట్ మెంట్ లో పట్టభద్రులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రావి చేసిన ప్రసంగాలు పట్టభద్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం మాజీ ఎమ్మెల్యే రావి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుందని తెలిపారు. దీనిలో భాగంగానే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా వేపాడ చిరంజీవిరావును పార్టీ అధినేత చంద్రబాబు ఎంతో వ్యూహాత్మకంగా ఆలోచన చేసి ఎంపిక చేశారన్నారు. గత 25ఏళ్ళుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వేపాడ చిరంజీవిరావు వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగ పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై వేపాడకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పక్కాగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తూ వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. వేపాడను గెల్పిస్తేనే నిరుద్యోగ పట్టభద్రులకు న్యాయం జరుగుతుందన్నారు. భీమిలి నియోజకవర్గంలో వేపాడకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నామని, పట్టభద్రులంతా బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. అందరి మద్దతుతో వేపాడను అత్యధిక మెజార్టీతో గెల్పించుకుంటామని మాజీ ఎమ్మెల్యే రావి ధీమా వ్యక్తం చేశారు.

Comments