ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవ్వాలి

 *- ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవ్వాలి


 *- చంద్రబాబు విజన్ వల్లే రాష్ట్రంలో పురోగతి* 

 *- తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముక* 

 *- కార్యకర్తల త్యాగాలను ఎన్నటికీ మరువలేం* 

 *- టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తాం* 

 *- తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వెనిగండ్ల రాము* 

 *- ఘనంగా టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు* 

 *- తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన వెనిగండ్ల* 


గుడివాడ, మార్చి 29 (ప్రజా అమరావతి): అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవ్వాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి వెనిగండ్ల రాము పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ 1982 మార్చి 29వ తేదీన ఆంధ్రుల ఆరాధ్య దైవం, మహానటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కిలో బియ్యం రూ. 2ల పథకాన్ని ఎన్టీఆర్ అమలు చేశారన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఉత్తేజపర్చి, ప్రపంచానికి తెలుగు జాతి ఉనికిని ఎన్టీఆర్ చాటి చెప్పారన్నారు. ముఖ్యమంత్రి భృతిగా ఒక్క రూపాయి మాత్రమే ప్రభుత్వం నుండి స్వీకరించడం ఎన్టీఆర్ కు మాత్రమే చెల్లిందన్నారు. ఆత్మగౌరవ నినాదంతో ఢిల్లీ స్థాయిలోనూ ఎన్టీఆర్ రాజకీయాలు చేశారని, ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నిలుస్తున్నారని, వారి త్యాగాలను మరువలేమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని, ఆయన కారణంగానే రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. అనంతరం 41 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలను వెనిగండ్ల రాము ఘనంగా సన్మానించారు. తెలుగు ప్రజలందరికీ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు కృష్ణాడెల్టా ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ గుత్తా చంటి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి చల్లగుళ్ళ సుబ్రహ్మణ్యేశ్వరరావు, మైనార్టీ నాయకులు షేక్ ఇబ్రహీం, తుమ్మలపల్లి సర్పంచ్ రాధాకృష్ణ, రుద్రపాక సర్పంచ్ జంగం రాజు, శంకరంపాడు సర్పంచ్ కైలే సుబ్బారావు, టీడీపీ సీనియర్ నాయకులు తులసి, అరికేపూడి రామశాస్త్రులు, కంచనపల్లి సుబ్రహ్మణ్యం, అందుగుల ఏసుపాదం, జోన్స్, మేరుగు మోజెస్, మరియకుమారి, సూరపనేని. రాజా, అడుసుమిల్లి లక్ష్మణరావు, బొంబాయి శ్రీను, లింగం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Comments