గ్రామాల్లో సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలతో పాటు దేవాలయాల అభివృద్ధికి కృషి

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


గ్రామాల్లో   సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలతో పాటు దేవాలయాల అభివృద్ధికి కృషి


చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ,  సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 


ఆదివారం ఉదయం పొదలకూరు మండల పరిధిలోని మహ్మదాపురం గ్రామంలో  తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మించనున్న శ్రీ రాధాకృష్ణ మందిర  నిర్మాణానికి మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి  శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి,  మీడియాతో మాట్లాడుతూ గ్రామాలకు సంబంధించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు,  భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రజల విజ్ఞప్తి మేరకు  అవసరమైన చోట దేవాలయాలను కూడా పెద్ద ఎత్తున నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు  తెలిపారు.  ఏ గ్రామాల్లో ఆలయాలను ప్రజలు కోరుకుంటారో అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ నిధులతో  సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన ఆలయాల నిర్మాణానికి  శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి తెలిపారు. సర్వేపల్లి  నియోజకవర్గంలో ఇప్పటి వరకు 28 దేవాలయాలను  టిటిడి సహకారంతో మంజూరు చేయించి నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. ఒక్కొక్క దేవాలయానికి 10 లక్షల రూపాయల వంతున  2.80 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగిదన్నారు. పొదలకూరు మండల పరిధిలో 9 దేవాలయాలు  ఒక్కొక్క దేవాలయానికి 10 లక్షల రూపాయల వంతున 90 లక్షల రూపాయలు మంజూరైనట్లు మంత్రి వివరించారు.   మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోనేవిధంగా ,  ఆధ్యాత్మిక భావాలు ఉట్టిపడేలా దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. సర్వేపల్లి నియోజక వర్గ పరిధిలో 50 దేవాలయాలను  నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. సర్వేపల్లి నియోజక వర్గ ప్రజల ఆశీస్సులతో   దేవాలయాల నిర్మాణం అనే మంచి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని,  ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా వుండాలని  కోరుకుంటున్నట్లు మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి అన్నారు. 

 ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments