*“పేదల ఆరోగ్యానికి ‘సంజీవని”*
*మంగళగిరి ప్రజల ఆరోగ్య భద్రతకు లోకేష్ కంకణం*
*గ్రామీణ ప్రజల కోసం సంజీవని ఆరోగ్య రథం*
*మంగళగిరి, తాడేపల్లిలో రెండు సంజీవని వైద్య కేంద్రాల ఏర్పాటు*
*ఈ కేంద్రాలతో పేదలకు అందుబాటులో అత్యాధునిక వైద్యసేవలు*
*200 రకాలకు పైగా రోగ నిర్ధారణ పరీక్షలు...మందులు అన్నీ ఉచితంగానే…*
*8 నెలల కాలంలో 50 వేల మందికి పైగా పేదలకు వైద్య సేవలు*
మంగళగిరి (ప్రజా అమరావతి);
అందరికీ ఆరోగ్యమస్తు.. ప్రతి ఇంటికీ శుభమస్తు...ఇదీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లక్ష్యం. తన లక్ష్యాన్ని ఆలోచనలతోనే సరిపెట్టకుండా కార్యరూపంలోకి నారా లోకేష్ తీసుకొచ్చారు. డబ్బుల్లేక సకాలంలో అవసరమైన వైద్యసేవలందక ఏ ఒక్క పేదోడు అనారోగ్యంతో బాధపడకూడదనే ఉద్దేశంతో ఓ బృహుత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేదల ఆరోగ్యానికి భరోసానిస్తూ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సంజీవని ఆరోగ్య రథం, సంజీవని వైద్య కేంద్రాలు నెలకొల్పి పేదల ఇళ్లల్లో వెలుగులు నింపారు. వైద్య కేంద్రాలు, ఆరోగ్య రథం ద్వారా కేవలం వైద్య పరీక్షలతో మాత్రమే సరిపెట్టకుండా ఉచిత మందుల పంపిణీతో పాటు 200 రకాల రోగ నిర్ధారణ పరీక్షలను కూడా ఉచితం నిర్వహిస్తున్నారు. ఈ మూడు వైద్య సేవలను ప్రారంభించిన ఎనిమిది కాలంలోనే 50 వేల మందికి పైగా రోగులకు సేవలందించారు.
*తొలుత ఆరోగ్య రథంతో సేవలు*
టీడీపీ కార్యకర్తల సంక్షేమ విభాగం కన్వీనర్ గా నారా లోకేష్ ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు సైతం డబ్బు ఖర్చు చేయలేని నిరుపేదలకు అండగా నిలవాలని నిర్ణయించారు. మంగళగిరి నియోజకవర్గంలో గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా నింపేలా సంజీవని ఆరోగ్య రథం పేరుతో మొబైల్ హాస్పిటల్ ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలందించడానికి గత సంవత్సరం ఆగస్టు 10న సంజీవని ఆరోగ్య రథాన్ని దుగ్గిరాల టీడీపీ కార్యాలయం వద్ద నారా లోకేష్ ప్రారంభించారు. సంజీవని ఆరోగ్యరథంలో అత్యాధునిక చికిత్స పరికరాలు, పరీక్ష యంత్రాలు, నెబ్యులైజర్, ఆక్సిజన్ వంటి ఎమర్జెన్సీకి అవసరమైన సామాగ్రిని నారా లోకేష్ సొంత ఖర్చులతో సమకూర్చారు. ఈ వాహనంలో ఒక జనరల్ ఫిజిషియన్, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్, ఫిమేల్ నర్స్, కాంపౌండర్ ఉంటారు. ఈ ఆరోగ్య రథం వద్దే 200కి పైగా రోగనిర్దారణ పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేస్తున్నారు. అవసరమైనవారికి మందులు కూడా ఉచితంగానే అందజేస్తున్నారు. ఈ ఆరోగ్య రథం ఏ ఊరులో, ఏ సమయంలో సేలందిస్తుందో ముందుగానే ఆయా గ్రామస్తులకు సమాచారం అందిస్తారు. ఆరోగ్య రథం అందించే సేవలన్నీ ఉచితంగానే అందజేస్తామని ఆయన తెలిపారు.
*రెండు సంజీవని ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు*
సంజీవని ఆరోగ్య రథం ద్వారా గ్రామీణవాసులకు వైద్యసేవందిస్తుంటే, మంగళగిరి, తాడేపల్లి వాసులకు కూడా అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని లోకష్ భావించారు. ఇందులో భాగంగా ఈ రెండు ప్రాంతాల్లో సంజీవని ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతేడాది ఆగస్టు 16న మంగళగిరిలోని టిప్పర్ల బజార్ లో సంజీవని ఆరోగ్య కేంద్రాన్ని లోకేష్ ప్రారంభించారు. అదే ఏడాది అక్టోబర్ 20న తాడేపల్లి పట్టణంలో మరో సంజీవని ఆరోగ్య కేంద్రాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యాధునిక చికిత్స పరికరాలు, పరీక్ష యంత్రాలు, ఎమర్జెన్సీకి అవసరమైన సామాగ్రిని తన సొంత ఖర్చులతోనే నారా లోకేష్ సమకూర్చారు. ఈ సంజీవని ఆరోగ్య కేంద్రంలో ఒక జనరల్ ఫిజిషియన్ అయిన డాక్టర్, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్, ఫిమేల్ నర్స్, కాంపౌండర్ ఉంటారు. 200కి పైగా రోగనిర్దారణ పరీక్షలు, మందుల కూడా ఉచితంగా అందజేస్తున్నారు.
50 వేల మందికి వైద్య సేవలు
సంజీవని ఆరోగ్య రథం, సంజీవని వైద్య ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేసిన అనతికాలంలోనే పేదల మన్ననలు పొందాయి. ఈ మూడు వైద్య కేంద్రాలను ప్రారంభించిన ఎనిమిది కాలంలోనే బుధవారం నాటికి 50 వేల మంది పేద రోగులు అత్యాధునిక వైద్యసేవలు పొందారు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా...నారా లోకేష్ ఆసుపత్రి ఉందన్న ధీమా పేదల్లో కలిగింది. ఇపుడు మంగళగిరి నియోజకవర్గం ప్రజల ఆరోగ్య భద్రతకు సంజీవని వైద్య కేంద్రాలు భరోసా నింపుతున్నాయి.
*సంక్షేమ సంకల్పమున్న నేత లోకేష్…*
సాధారణంగా గెలిచిన తరవాత, తమ పార్టీ అధికాంలోకి వచ్చాక ప్రజల మంచీ చెడులు చూసే నేతలుండడం సహజం.ఇందుకు భిన్నంగా, తమ పార్టీ అధికారంలోకి రాకున్నా, తాను నమ్ముకున్న ప్రజలు ఓడించినా...సేవ చేయాలన్న తన సంకల్పాన్ని నారా లోకేష్ విడిచిపెట్టలేదు. గెలుపోటములు సంబంధ లేకుండా, పార్టీలకతీతంగా ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ వారి బాగోగులను చూసుకోవడమే లోకేష్ బాధ్యతగా పెట్టుకున్నారు. ఉచిత వైద్య సేవలందించడం ద్వారా నియోజక వర్గ ప్రజల ఆరోగ్యానికి వెన్నుదన్నుగా నిలిచారు.
addComments
Post a Comment