డాక్టర్ ప్రీతిభాయి ఆత్మహత్యకు కారకుడైన సైఫ్ ను ఉరి తీయాలి.

 డాక్టర్ ప్రీతిభాయి  ఆత్మహత్యకు కారకుడైన సైఫ్ ను ఉరి తీయాలి.



ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకుల డిమాండ్.


చిలకలూరిపేట (ప్రజా అమరావతి);జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాలో పుట్టి అత్యంత ప్రతిభ కనబరిచి  కాకతీయ మెడికల్ కాలేజీలో  లక్ష్యానికి చేరువకావాలనే లక్ష్యంతో ధరావత్ ప్రీతీ భాయి ఆ కాలేజీలో చదువుతుంది. ప్రాణాలు పోసే స్థానంలో ఉన్న ఆమెకుర్యాగింగ్ కు , జూనియర్ సీనియర్ల మధ్య వ్యత్యాసాలకు కులం రంగు పులిమి వేధించడం ఉన్నత విద్యా సంస్థలు, పాలన అధికారులు పాటిస్తున్న అనాగరిక విలువలకు పరాకాష్టమని  ఏపీ గిరిజన సంఘాల వేదిక నాయకుల పేర్కొన్నారు. ఎన్నార్టీ సెంటర్లోని  సంఘం కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ వేధింపులకు గురి చేసిన సైఫ్ ను కఠినంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు.ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండ నేర సంస్కృతిని పెంచి పోషిస్తున్న కాకతీయ మెడికల్ కళాశాల పాలనాధికారులపై , సరైన పర్యవేక్షణ చేయకుండా కళాశాల విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన హెల్త్ యూనివర్సిటీ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు.ప్రీతిభాయి మృతిపై అనేక అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయని వాటిని నివృత్తి చేసేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్, పట్టణ గౌరవ అధ్యక్షులు బి. చిన్న నాయక్, పట్టణ అధ్యక్షులు అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దేవర డేవిడ్, కోశాధికారి బి రాంబాబు నాయక్,నాయకులు చుండూరి ఆనంద్ బాబు,విద్యార్థి విభాగ నాయకులు కె. వాగ్యా నాయక్ తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments