అభివృద్ధిని..సంక్షేమాన్ని చూసి ఓటెయ్యండి

 *అభివృద్ధిని..సంక్షేమాన్ని చూసి ఓటెయ్యండి*▪️వెన్నపూస రవీంద్రరెడ్డి, రామచంద్రారెడ్డిలను గెలిపించండి

▪️గ్రాడ్యుయేట్స్, టీచర్స్‌ను కోరిన మాజీ ఎమ్మెల్యే విశ్వ, ఎమ్మెల్సీ మంగమ్మ, జిల్లా అధ్యక్షుడు పైలా


-ఉరవకొండలో విస్త్రృతంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైస్సార్సీపీ నేతలు


ఉరవకొండ (ప్రజా అమరావతి):

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు వెన్నపూస రవీంద్రరెడ్డి, రామచంద్రారెడ్డిలను గెలిపించాలని ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య,యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ యాదవ్,హస్త కళల కార్పొరేషన్ చైర్మన్ హరిత,ఆర్టీసీ జోనల్ చైర్మన్ మంజుల, ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ లిఖిత కోరారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని పట్టభద్రులకు వారు అభ్యర్థించారు. ఈ మేరకు ఉరవకొండ పట్టణంలో మంగళవారం సాయంత్రం విస్తృత ప్రచారం నిర్వహించారు.ఉపాధ్యాయులు, ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లను కలిశారు.ఈనెల 13వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్‌ అభ్యర్థిగా వెన్నపూస రవీంద్రారెడ్డి, టీచర్స్‌ అభ్యర్థిగా రామచంద్రారెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో వైస్సార్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments