పెట్టుబడుల సదస్సు సక్సెస్ తో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది.

 *పెట్టుబడుల సదస్సు సక్సెస్ తో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది*▪️సీఎం జగన్ సమర్థతకు నిదర్శనం 13 లక్షల కోట్ల పెట్టుబడులు


-మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి,ఎమ్మెల్సీ మంగమ్మ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య


-విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ సక్సెస్ తో ఉరవకొండలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వైస్సార్సీపీ నేతలు..


ఉరవకొండ (ప్రజా అమరావతి):

విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ సక్సెస్ తో రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల మేర పెట్టుబడులు తరలి రావటంతో ఇప్పుడు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య అన్నారు.విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌) గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో ఉరవకొండలో నియోజకవర్గ ఇంచార్జ్ వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పైలా నరసింహయ్య, ఎమ్మెల్సీ మంగమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ యాదవ్,హస్త కళల కార్పొరేషన్ చైర్మన్ హరిత, ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ లిఖిత, ఆర్టీసీ జోనల్ చైర్మన్ మంజుల, బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు సిపి వీరన్న, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు బసవరాజు తదితరులు హాజరయ్యారు.ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఒకరికొకరు తినిపించుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ విశాఖలో జరిగిన పెట్టుబడిదార్ల సదస్సు నుంచి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు.దాదాపు 352 ఎంఓయూలు, రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 6 లక్షలకు ఉద్యోగాల కల్పనకు విశాఖ వేదిక కావడం సంతోషకర విషయమన్నారు.రాష్ట్ర భవిష్యత్తు, యువతకు ఉపాధికి ఇది దోహద పడుతుందని చెప్పారు.రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా మరింత బల పడుతుందని తెలిపారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్థతకు ఈ సదస్సు నిదర్శనంగా నిలిచిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావు అని విమర్శలు చేసిన వాళ్లకు ఈ సదస్సు చెంప దెబ్బలాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments