ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుంటే యాజమాన్యాలపై క్రిమినల్ కేసులుకు ఆదేశాలు:రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాంఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుంటే యాజమాన్యాలపై క్రిమినల్ కేసులుకు ఆదేశాలు:రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం 


శ్రీ సత్య సాయి (ప్రజా అమరావతి):ఫీజులు కట్టలేదన్న నెపంతో ఏ ఒక్క ఇంటర్మీడియట్ విద్యార్థికి హాల్ టికెట్లు నిరాకరించినట్లు ఫిర్యాదు అందినా, విద్యా సంవత్సరం కోల్పోయినట్లు గుర్తించినా ఆయా కళాశాలల గుర్తింపును 2023-24 విద్యా సంవత్సరం నుండి రద్దు చేసేందుకు సిఫారసులు చేయనున్నామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు,ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ పరీక్షలు దగ్గరపడుతున్నా చివరి నిముషం వరకు విద్యార్థులను మానసికంగా ఫీజులు పేరిట వేధిస్తున్నట్టు విద్యార్థులు,వారి తల్లిదండ్రుల నుండి తమకు అందుతున్న ఫిర్యాదులను పరిశీలనలోకి తీసుకొని ఆయా యాజమాన్యాలపై అవసరమనుకుంటే క్రిమినల్ చర్యలుకు కమిషన్ తరపున సిఫారసులు చేయనున్నామని అన్నారు,అలాగే పరీక్షలు జరిగే ప్రతీ కేంద్రంలో కనీస మౌలిక సదుపాయాలు,దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు లేమిపై విద్యార్థులు,వారి తల్లిదండ్రుల నుండి అందే ప్రతీ ఫిర్యాదును యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు,ఆర్ఐఒ లకు ఆదేశాలు జారీచేస్తున్నామని అన్నారు,ఇంటర్మీడియట్ బోర్డు సూచించిన టోల్ ఫ్రీ నెంబర్ 1800 4257635 తో పాటు apscpcr2018@gmail.com కు ఫిర్యాదులు అందిస్తే చర్యలు చేపట్టేందుకు కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు సారథ్యంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సిద్ధంగా ఉందని సీతారాం చెప్పారు.

Comments