మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి.



*మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి*



పార్వతీపురం/పాచిపెంట, మార్చి 27 (ప్రజా అమరావతి): మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. పాచిపెంట మండల కేంద్రంలో సోమ వారం జరిగిన వై.ఎస్.ఆర్.ఆసరా కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వై.ఎస్.ఆర్ ఆసరా, జగనన్న చేయూత తదితర పథకాలు ప్రభుత్వం అమలు చేస్తూ మహిళల ఆర్థిక ప్రగతికి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. అనేక మంది మహిళలు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారని, కొంత మంది గొర్రెలను కొనుగోలు చేసి ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకుంటున్నారని ఆయన చెప్పారు. కుటుంబాలను ఆర్థికంగా ముందుకు నడిపించడం వలన అన్ని రంగాల్లో ప్రగతి వస్తుందని ఆయన పేర్కొన్నారు.  వై.ఎస్.ఆర్.ఆసరా కార్యక్రమం క్రింద మూడవ విడతలో జిల్లాలో 16,646 స్వయం సహాయక సంఘాలకు చెందిన 1,83,077 మంది సభ్యులకు రూ.94.18 కోట్లు ఆసరా నిధులు జమ అయ్యాయన్నారు. సాలూరు నియోజక వర్గంలో 3585 సంఘాలకు చెందిన మహిళకు రూ.16.64 కోట్లు జమ అయ్యాయని తెలిపారు.


జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఆసరా మొదటి విడతలో 16,534 సంఘాలకు చెందిన 1,86,192 మంది సభ్యులకు రూ.93.52 కోట్లు, రెండవ విడతలో 16,646 సంఘాలకు చెందిన 1,88,069 మంది సభ్యులకు రూ.94.32 కోట్లు జమ అయ్యాయన్నారు. మూడు విడతల్లో రూ.314.92 కోట్లు జమ అయ్యాయని తెలిపారు.  జిల్లాలో మహిళల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలని చర్యలు చేపడుతున్నామని అన్నారు. డి.ఆర్.డి.ఏ నేతృత్వంలో మహిళా మార్టు ఏర్పాటు చేయుటకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 


ఈ కార్యక్రమంలో అధికార, అనధికారులు పాల్గొన్నారు.

Comments