విద్యా రంగంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోంది.రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


..జిల్లాలోవిద్యా దీవెన జిల్లాలో మొత్తం 32,592 విద్యార్థులకు 29,125 మంది  తల్లుల బ్యాంకు ఖాతాలకు రు. 23 కోట్ల 70 లక్షల జమ...


...  కలెక్టరు డా. కె. మాధవీలత

.... ఎంపి మార్గని భరత్ రామ్ 


మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి విద్యా అని నమ్మిన వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని విద్యా రంగంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోంద


ని  జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీ లత, పార్లమెంట్ సభ్యులు  మార్గని భరత్ రామ్ లు పేర్కొన్నారు. 


ఆదివారం రాష్ట్రం ముఖ్యమంత్రి  ఎన్టీఆర్ కృష్ణా .  తిరువూరు లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి విద్యార్థుల తల్లులు ఖాతా లకు 3వ త్రైమాసిక లబ్దిని జమ చేశారు. 


స్థానిక రాజమహేంద్రవరం  కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి జగనన్న విద్యా దీవెన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, ఏ ఒక్క విద్యార్థి చదువు మానకుండా ఉన్నత విద్య వరకు చదువుకునే విధంగా ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. నేటి విద్యార్థులే రేపటి రాష్ట్ర భవిష్యత్తు అని నమ్మి వ్యక్తి మన సిఎం అన్నారు. విద్యా దీవెన పథకం కింద తల్లుల ఖాతాకు నేరుగా నగదు బదిలీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణ లో ఇంటర్మీడియట్ కళాశాలల్లో గత మూడు నాలుగు దశాబ్దాలు గా ఎటువంటి సంస్కరణ లు జరగలేదని, నేడు ఆదిశలో నాడు నేడు ద్వారా పనులు జరుగుతున్నట్లు తెలిపారు. విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి: 

 ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ మాధవీలత పిలుపు నిచ్చారు.  విద్యే మన బలం అని నమ్మి మరింత మంచి భవిష్యత్తు పొందాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం వార్షిక పరీక్షలను ఎలా రాస్తున్నరంటూ ప్రశ్నించి, అభినందనలు తెలిపారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తూన్నట్లు పేర్కొన్నారు. జగనన్న విద్యా కానుక కింద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చదువుకు పేదరకం అడ్డు రాకూడదనే లక్ష్యంతో  మంచి నాణ్యమైన విద్యను అందించే దిశ రాష్ట్రంలో పాఠశాలలు ఆదునీకరిస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఎంపి పార్లమెంట్ సభ్యులు  మార్గని భరత్ రామ్ పేర్కొన్నారు.  ఈరోజు జగనన్న విద్యా దీవెన 3వ త్రైమాసికంగా తూర్పు గోదావరి జిల్లాలోని 32,592 విద్యార్థులకు 29,125 మంది  తల్లుల బ్యాంకు ఖాతాలకు రు. 23 కోట్ల 70 లక్షల జమ చేయడం జరిగిందన్నారు.  ఆ మొత్తాన్ని వారి పిల్లల భవిష్యత్తు కి వినియోగించి ప్రయోజకులను చెయ్యాలన్నారు. రాష్ట్రంలో పిల్లలకు ఇచ్చే ఆస్థి విద్యే అని బలంగా నమ్మే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదిశలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో నియోజకవర్గం వారీగా జమ చేసిన వివరాలు...


అనపర్తి నియోజకవర్గంలో 3467 మంది  విద్యార్థులకు 3094 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రు 2.33కోట్లు,  రాజానగరం నియోజకవర్గంలో 4066 మంది  విద్యార్థులకు 3922 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రు 2.65 కోట్లు, రాజమహేంద్ర వరం రూరల్ నియోజకవర్గంలో 5033 మంది  విద్యార్థులకు 3675 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రు 2.76 కోట్లు, రాజమహేంద్రవరం అర్బన్ నియోజక వర్గంలో 6060 మంది  విద్యార్థులకు 5427 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రు 4.35 కోట్లు, గోపాలపురం  నియోజకవర్గంలో 3808మంది  విద్యార్థులకు 3706 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రు 3.00 కోట్లు, కొవ్వూరు  నియోజకవర్గంలో 4223 మంది  విద్యార్థులకు 3757 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రు 3.26 కోట్లు, నిడదవోలు  నియోజకవర్గంలో 5066 మంది  విద్యార్థులకు 4489 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రు 3.90 కోట్లు, జగ్గంపేట  నియోజకవర్గంలో గోకవరం మండలంలో 811 మంది  విద్యార్థుల 741 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రు 46 లక్షలు,  రంపచోడవరం (ఎస్టీలకు ) గోకవరం మండలంలో 58 మంది  విద్యార్థుల 52 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రు 3.57 లక్షలు జమ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు, క్రిస్టియన్ మైనారిటీ సంబందించి జగనన్న విద్యా దీవెన క్రింద 3వ త్రైమాసికంగా మొత్తం 32592 విద్యార్థులకు 29215 మంది  తల్లుల బ్యాంకు ఖాతాలకు రు. 23కోట్ల 708 లక్షల రూపాయలను జమ చేయడం జరిగింది.


ఇప్పటి వరకు జగనన్నవిద్యా దీవెన, జగనన్న వసతి  దీవెన క్రింద మొత్తం 2,54,104 మంది విద్యార్థులకు గాను 2,29,  650 మంది తల్లుల ఖాతాల్లో రు.176.23 కోట్లు జమ చేయడం జరిగింది.


కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి - జీ. జనార్ధన రావు, డి టి డబ్ల్యు ఓ -  కె. జ్యోతి,  డి బి డబ్ల్యు ఓ - పి. సత్య రమేష్, వివిధ కళాశాల విద్యార్థులు, వారి తల్లులు పాల్గొన్నారు.


Comments