అంగన్వాడీ పోస్టుల నోటిఫికేషన్ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి.

 అంగన్వాడీ పోస్టుల నోటిఫికేషన్ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి



*


*: జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మార్చి 27 (ప్రజా అమరావతి):


అంగన్వాడీ పోస్టుల నోటిఫికేషన్ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో అంగన్వాడి కార్యకర్తలు మరియు సహాయకుల ఎంపిక  తదితర పోస్టుల నియామకంపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ వర్కర్ల పోస్టులను గుర్తించాలన్నారు. ఖాళీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఇందులో ఎలాంటి ఆలస్యం చేయరాదన్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన ఫైల్ మంగళవారం సాయంత్రంలోపు తమకు అందజేయాలని ఐసిడిఎస్ ఆర్జెడిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 

 జిల్లా పరిధిలోని  సిడిపివోలు  పెనుగొండ, మరియు కదిరి పడమర, కదిరి తూర్పు మరియు ధర్మవరం వారి పరిధిలోని  అంగన్వాడి సూపర్వైజర్ల ప్రమోషన్లు, అంగన్వాడి సిబ్బంది ట్రాన్స్ఫర్, అంగన్వాడి కేంద్రాల మార్పు, తదితర అంశాలపై సమీక్షలు నిర్వహించారు. ఈ సమావేశంలో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, ఐసిడిఎస్ ఆర్జెడి పద్మజ, పిడి లక్ష్మి కుమారి, ఆర్డీవోలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, తిప్పే నాయక్, డిఎంహెచ్ఓ డా. కృష్ణారెడ్డి,  డి ఆర్ డి పి డి నరసయ్య,సిడిపివోలు తదితరులు పాల్గొన్నారు.


Comments