*దివ్యాంగులతో ముచ్చటించిన యువనేత లోకేష్*
కదిరి (ప్రజా అమరావతి);
• సత్యసాయిజిల్లా, కదిరి మండలం, మొటుకుపల్లి గ్రామంలోని దివ్యాంగుల ఆశ్రమాన్ని సందర్శించిన యువనేత నారా లోకేష్..
• దివ్యాంగ పిల్లలతో సరదాగా ముచ్చటించి, వారికి స్వీట్లు, చాక్లెట్లు ఇచ్చి ఆప్యాయంగా పలకరించిన యువనేత.
• ఏ సబ్జెక్ట్ మీకు ఇష్టం? మీరు ఎలా చదువుతున్నారు? టీచర్లు బాగా బోధిస్తున్నారా? అంటూ పిల్లలతో ముచ్చట.
• ఉపాధ్యాయులను గౌరవించాలి..వారు మనకోసం చేస్తున్న శ్రమకు మనం తగిన గౌరవం ఇవ్వాలని విద్యార్థులకు చెప్పిన యువనేత.
• ఆశ్రమంలో పిల్లలకు అందుతున్న సౌకర్యాలు, వసతులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్న లోకేష్.
• లోకేష్ కుమారుడు దేవాన్ష్ కుమారుడికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన దివ్యాంగ చిన్నారులు. మురిసిపోయిన లోకేష్.
• తమకు పాఠశాలలో బోధిస్తున్న పాఠ్య పుస్తకాలు లోకేష్ కు చూపించిన విద్యార్థులు, సిబ్బంది.
• తాము నేర్చుకున్న పాఠాలను బోర్డుపై రాసి చూపించిన చిన్నారి కార్తికేయ, అభినందించిన యువనేత.
• ఆశ్రమంలోని పరిస్థితులను లోకేష్ కు వివరించిన అనంతపురం ఆర్.డీ.టీ(రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్) డైరెక్టర్ దశరథ్.
• అనంతపురం, సత్యసాయి, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో దివ్యాంగుల అభివృద్ధికోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు లోకేష్ కు వెల్లడి.
• అనంతపురం జిల్లాలోకే 16ఆశ్రమ పాఠశాలలున్నాయని వివరణ.
• దివ్యాంగుల పూర్వపు చట్టాల్లో 7రకాల దివ్యాంగులకు మాత్రమే గుర్తింపు ఉందని, 2016 ఆర్.పీ.డబ్ల్యు.డీ చట్టం లో 21రకాల దివ్యాంగులకు గుర్తింపునిచ్చేందుకు అవకాశం ఉందని, దాని అమలుకు చర్యలు తీసుకోవాలని కోరిన దశరథ్.
• రాష్ట్రంలో ప్రస్తుతం 7 రకాల దివ్యాంగులకు మాత్రమే సర్టిఫికెట్లు వస్తున్నాయని, మిగిలిన వారికి కూడా సర్టిఫికెట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటే మరింత మందికి సేవలందించడానికి అవకాశం ఉంటుందని వివరణ.
• అధికారంలోకి వచ్చాక తప్పకుండా దివ్యాంగుల సమస్యలపై చర్యలు తీసుకుంటామని, 21రకాల దివ్యాంగులకు సర్టిఫికెట్లు వచ్చేందుకు చొరవ తీసుకుంటానని లోకేష్ హామీ.
• పిల్లలు, సిబ్బందితో సరదాగా ఫోటోలు దిగిన యువనేత.
• తమ పక్కన కూర్చోవాలంటూ కోరడంతో వారి మధ్యలో కూర్చొని ఫోటోలు దిగిన లోకేష్. సంతోషం వ్యక్తం చేసిన చిన్నారులు.
addComments
Post a Comment