ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే వినూత్న కార్యక్రమమే గడప గడప కు మన ప్రభుత్వమ

 

నెల్లూరు  మార్చి 31 (ప్రజా అమరావతి);


ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే వినూత్న కార్యక్రమమే గడప గడప కు మన ప్రభుత్వమ


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.


శుక్రవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం టి పి గూడూరు మండలం కొత్త కోడూరు పంచాయతీ పరిధిలో నాల్గవ రోజు గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన మంత్రి కాకాణికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.


గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్న వైనం తెలుసుకుంటూ ప్రజలతో మమేకమయ్యారు.


ఈ సందర్బంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ  గ్రామాల ప్రాధాన్యతల మేరకు కనీస అవసరాలతో పాటు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. నాలుగేళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత ప్రజా ప్రతినిదులందరూ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదాయని ధైర్యంగా తెలుసుకునేందుకు వేదిక ముఖ్యమంత్రి కల్పించారన్నారు. గ్రామాల్లో గతంలో అనేక సమస్యలు కనిపించేవని, ప్రస్తుతం గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించామనే ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. మత్స్యకార గ్రామాల్లో వేటకు వెళ్లే రోడ్లు, రైతులు పొలాలకు వెళ్లే రోడ్లు కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామన్నారు. 


ఈ కార్యక్రమంలో యం పి డి ఓ హేమలత, వివిధ శాఖల మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

    



Comments