యువగళం దెబ్బ ఎలా ఉంది జగన్? దెబ్బ అదుర్స్ కదూ!

 పుట్టపర్తి నియోజకవర్గం (ప్రజా అమరావతి);


ఒడిసి రెయిన్ బో ఎడ్యుకేషన్ అకాడమీ వద్ద బహిరంగ సభ లో నారా లోకేష్ మాట్లాడుతూ 




ప్రశాంత నిలయం పుట్టపర్తి.

ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి.

లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటూ ప్రపంచానికి సేవాభావం నేర్పిన భగవాన్ సత్యసాయి జన్మించిన నేల ఇది.

ప్రతి పేదవాడి చిరునవ్వు లో సత్య సాయి కనిపిస్తారు.

సత్య సాయి చేసిన సంక్షేమ, సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి.

ఎంతో చరిత్ర ఉన్న పుట్టపర్తి లో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

యువగళం దెబ్బ ఎలా ఉంది జగన్? దెబ్బ అదుర్స్ కదూ!


స్టూడెంట్ లీడర్ గా ఎదిగిన మన చంద్రన్న ముందు టెన్త్ ఫెయిల్ జగన్ కుప్పిగంతులు వేసాడు. 

లాగిపెట్టి ఒకటి కొడితే కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. 

ఆయన రాజకీయం ముందు నువ్వెంత జగన్...అమూల్ బేబీ.

జనం జగన్ ని నమ్మడం లేదు. కన్న తల్లి జగన్ ని నమ్మడం లేదు. తోడపుట్టిన చెల్లి జగన్ ని నమ్మడం లేదు. 

పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్ ని నమ్మడం లేదు. ఆఖరికి పార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్ ని నమ్మడం లేదు. 

అందరూ అంటుంది ఒకటే వీ డోంట్ ట్రస్ట్ జగన్. జగన్ అంటే మాకు నమ్మకం లేదు అంటున్నారు. 

అందరికీ అర్ధం అయిపోయింది ఆయన జగన్ మోహన్ కాదు మోళీ మోహన్ అని. 

సింహం సింగిల్ గా వస్తుంది అన్నాడు. నా వెంట్రుక కూడా పీకలేరు అన్నాడు. 

ఇప్పుడు తాడేపల్లి ప్యాలస్ లో కుర్చొని టీవీలు పగలుగొడుతున్నాడు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనం జగన్ కి గుండు కొట్టించి రోడ్డు మీద నిలబెట్టారు. 

నాలుగేళ్లుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టావ్, మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టావ్, మా నాయకుల్ని ఇబ్బంది పెట్టావ్. 

మేము ఏది దాచుకోము అట్టుకు అట్టున్నర పెడతాం బీ రెడీ జగన్.

జగన్ పనైపోయింది. ఖైదీ నంబర్ 6093ని జైలు రమ్మంటుంది. 

బ్రదర్ జగన్ నీకు భయాన్ని సాంపిల్ గా మాత్రమే చూపించాం. పూర్తి స్థాయిలో నువ్వు భయంతో బ్రతికేలా చేసే బాధ్యత నాది.

ఒక్క ఛాన్స్ అన్న మోళీ మోహన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసాడు 

జాబ్ క్యాపిటల్ గా ఉన్న ఆంధ్రా ని గంజాయి క్యాపిటల్ గా మార్చేశాడు

ఏపీలో డెవెలప్మెంట్ నిల్లు... అప్పులు ఫుల్లు. 

కుడి చేత్తో 10 రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయిలు కొట్టేస్తున్నాడు మోళీ మోహన్. 

ఆయన దగ్గర రెండు బటన్స్ ఉంటాయి. ఒక బటన్ నొక్కగానే సంక్షేమ కార్యక్రమాల పేరుతో మీ అకౌంట్ లో 10 రూపాయిలు పడతాయి. 

అదే బల్ల కింద రివర్స్ బటన్ ఉంటుంది అది నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయిలు జగన్ ఖాతాలోకి వెళ్లిపోతాయి. 

ఎలా వెళ్తాయో కూడా నేను చెబుతా. కరెంట్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ నంబర్1. ఇంటి పన్ను రెట్టింపు చేసాడు, చెత్త పన్ను వేసాడు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇదే రివర్స్ బటన్. 

మోళీ మోహన్ పాలనలో రేపులు, మర్డర్లు, దొంగతనాలు చేసిన ఖైదీలకు ఉన్న విలువ విద్యార్థులకు, యువతకు లేదు. 

ఆయన కూడా ఖైదీ కాబట్టి సాటి ఖైదీలను అందుకుంటున్నాడు తప్ప బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు సహాయం చెయ్యడం లేదు. 

చంద్రబాబు గారు సంక్షేమ హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచి ఆదుకున్నారు. 

మోళీ మోహన్  గొప్పగా విద్యా దీవెన, వసతి దీవెన అని పేరు మార్చారే తప్ప ఈ నాలుగేళ్లలో ఒక్క రూపాయి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచలేదు. 

ఆయన ఖైదీ కాబట్టి విద్యార్థుల కంటే ఖైదీలకు ఎక్కువ ఛార్జీలు ఇస్తున్నాడు. మోళీ మోహన్ పాలనలో ఖైదీలకు ఖర్చు చేసేది నెలకి 2 వేలు... విద్యార్థులకు ఖర్చు చేసేది వెయ్యి రూపాయిలు మాత్రమే.

యువత కు అనేక హామీలు ఇచ్చిన మోళీ మోహన్ ఆఖరికి యువత చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టాడు. 

జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

మోళీ మోహన్ మహిళలకు ఇచ్చిన హామీలు అన్ని మర్చిపోయాడు. 

మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. అందుకే మహిళలు ఎక్కడ చీపుర్లతో కొడతారో అని బయపడి పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి అన్నాడు. 

టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. 

మోళీ మోహన్ రైతుల్ని ముంచేసాడు. గిట్టుబాటు ధర లేదు, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు. 

జగన్ పరిపాలన లో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు కొడితే మాత్రం పురుగులు చస్తాయి. 

రైతుల్ని ఆదుకోకపోగా మోళీ మోహన్ మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. 

మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. 

మోళీ మోహన్ ఉద్యోగస్తులకు ఝలక్ ఇచ్చాడు. 

వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అన్న మోళీ మోహన్ 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. 

పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు.

బీసీల బ్యాక్ బోన్ విరిచేసాడు మోళీ మోహన్. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. 

బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. 

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. 

పుట్టపర్తి లో ఉన్న రెడ్డి సామాజికవర్గం వారిని కూడా ఆలోచించమని అడుగుతున్నా. 

మీరు ఎన్నో త్యాగాలు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. మీరు కనీస గౌరవం దక్కిందా?

సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి తప్ప ఇతర ఏ రెడ్డి సోదరుడు కైనా జగన్ పాలనలో న్యాయం జరిగిందా? జగన్ పాలనలో కాంట్రాక్టులు చేసిన రెడ్డి సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

మోళీ మోహన్ రాయలసీమ కు చేసింది ఏంటి? మోళీ మోహన్ ఉమ్మడి అనంతపురం జిల్లా కి చేసింది ఏంటి?

రాయలసీమ బిడ్డ అని ప్రచారం చేసుకున్నాడు. ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ. 

రెండు సార్లు కడప ఉక్కు ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేసాడు. ముందు 20 వేల మందికి ఉద్యోగాలు అన్నాడు. ఇప్పుడు 6 వేల మందికి అంటున్నాడు. 

రెండు సార్లు చేసిన శంకుస్థాపన కోసం సొంత మీడియా కి 30 కోట్లు ప్రకటనలు ఇచ్చాడు. 30 పైసలు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఖర్చు చెయ్యలేదు.

అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది.

రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.

అన్నమయ్యా గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు.

హంద్రీనీవా, గాలేరు నగరి ఇలా టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే.

కియా కారు చూస్తే అనంతపురం గుర్తు వస్తుంది. దటీజ్ చంద్రబాబు గారు. డ్రిప్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు ఇలా ఏమి చూసినా చంద్రబాబు గారు గుర్తు వస్తారు. జగన్ కి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. అనంతపురం కి నువ్వు తెచ్చిన ఒక్క కంపెనీ ఉందా?ఒక్క అభివృద్ధి కార్యక్రమం నువ్వు చేసావా?

పుట్టపర్తి ఎమ్మెల్యే పేరు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ఆయన ప్రజా ధనం దోపిడీ లో దిట్ట. 

అందుకే ఆయన పేరు మార్చాను దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి. 

దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి గారు ఆయన అనుచరులు కలిసి ఆధ్యాత్మిక కేంద్రాన్ని అరాచక కేంద్రం గా మార్చేశారు. 

ముందు మీకు జగన్, దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి పుట్టపర్తికి ఇచ్చిన హామీలు గుర్తుచేస్తాను. 

ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక వలసలు ఉన్న ప్రాంతం పుట్టపర్తి. అలాంటి ప్రాంతానికి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చి సాగు, తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో 90 శాతం పనులు పూర్తి చేసాం. ప్రధాన కాలువ పనులు కూడా పూర్తి చేసాం. 2018 లో చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు 193 చెరువులకు నీరు అందించడం కోసం 2018లో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. డిపిఆర్ పూర్తిచేసి పనులు ప్రారంభించిన సమయంలో ప్రభుత్వం మారింది. 

పుట్టపర్తి నియోజకవర్గానికి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 193 చెరువులకు నీరిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక రెండేళ్ల పాటు దాని ఊసే ఎత్తలేదు. రెండేళ్ల కిందట ఓ జీవో విడుదల చేశారు. 864 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తామని గొప్పగా ప్రకటించారు.  ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన హడావిడి మాములుగా లేదు. కొన్ని లక్షలు ఖర్చుచేసి పెద్ద ర్యాలీ చేశారు. ఇక ప్రాజెక్టు కట్టేసినట్లే అని ప్రజలంతా అనుకున్నారు. కాని రెండేళ్లు గడుస్తున్నా అతీగతీ లేదు.  రెండేళ్లుగా ఒక్క గంప మట్టి కూడా తీయలేదు.  అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి కోట్లు పెట్టి ఓ ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టుకున్నాడు కానీ నియోజకవర్గ ప్రజలకు మాత్రం చేసింది శూన్యం. 

జగన్ రెడ్డి పుట్టపర్తికి వచ్చినపుడు మరో హామీ కూడా ఇచ్చారు. పుట్టపర్తిని అధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటకంగా కూడా డెవలప్ చేస్తానన్నారు. చిత్రావతిలో, బుక్కపట్నం చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టపర్తికి వచ్చింది లేదు.. నిధులు ఇచ్చింది లేదు. పైగా ఈ వైసిపి బ్యాచ్ పుట్టపర్తిలో ఉన్న ప్రశాంతతను, అందాన్ని కూడా చెడగొట్టారు.  మురుగునీటి శుద్ది కేంద్రం (డ్రైనేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్) నిర్వహణను గాలికొదిలేయడంతో ఇప్పుడు ప్రతిరోజు పుట్టపర్తిలోని కొన్ని లక్షల లీటర్ల మురుగు నీరు బుక్కపట్నం చెరువులోకి వెళ్తోంది. అదే చెరువులో నుంచి తాగునీరు వెళ్తున్న గ్రామాల్లో జనం రోగాల బారిన పడి అవస్థలు పడుతున్నారు. వైసిపి బ్యాచ్ కబ్జాలు, దౌర్జన్యాల కారణంగా పుట్టపర్తికి భక్తులు రావాలంటేనే భయపడే పరిస్థితి. 

బుక్కపట్నం మండలంలోని మారాల జలాశయాన్ని 0.5 టీఎంసీల కెపాసిటీతో 2018లోనే చంద్రబాబునాయుడు పూర్తి చేశారు.  కాలువలు పూర్తి చేసి బుక్కపట్నం, ముదిగుబ్బ మండలాల్లో  వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరందించే క్రమంలోనే ప్రభుత్వం మారిపోయింది. పాదయాత్రలో భాగంగా మారాల వచ్చిన జగన్ రెడ్డి కాలువలు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. నాలుగేళ్లు గడిచిపోయింది. ఇప్పటివరకు ఒక్క పని కూడా మొదలుపెట్టలేదు.  మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పుకునే జగన్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గానికి ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు.  

దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే నా లేక హైదరాబాద్ ఎమ్మెల్యే నా? ఆయన నియోజకవర్గంలో ఉండేది తక్కువ. హైదరాబాద్ లో ఉండేది ఎక్కువ. ఆయనకు కాంట్రాక్టులు.. రియల్ ఎస్టేట్ తప్ప ప్రజా సమస్యలు పట్టవు. వారంలో ఒక రోజు పుట్టపర్తిలో ఉంటే ఆరు రోజులు ఇతర రాష్ట్రాల్లోనే ఉంటారు. ఈయన పేరు చెప్పి కుటుంబ సభ్యుులు, అనుచరులు చేస్తున్న అరాచాకాలు అన్ని ఇన్ని కాదు. మట్టి దగ్గర నుంచి ల్యాండ్ మాఫియా వరకు అనుచరుల హవా కొనసాగుతోంది. పుట్టపర్తి నియోజకవర్గంలో ఎవరు లేఅవుట్ వేసినా ఎమ్మెల్యే గారికి కప్పం కట్టాల్సిందే. ఈయనకు కప్పం కడితే చాలు.. ప్రభుత్వ అనుమతులేమి అవసరం లేదు. ఈయన వసూలు చేస్తున్న ట్యాక్స్ కారణంగా ఏ ఒక్కరూ లేఅవుట్ కు అనుమతులు తీసుకోవడం లేదు. పుట్టపర్తి చుట్టూ పర్మిషన్ లేని లేఅవుట్ లు కొన్ని వందలు వెలిశాయి.  

పుట్టపర్తిలో ఓ బిల్డర్ ను బెదిరించి కోటిన్నర రూపాయాలు వసూలు చేశారు. ఓడీసీ మండలంలో టీచర్లంతా కలిసి ఏర్పాటు చేసుకున్న లేఅవుట్ కోసం కోటి రూపాయలు తీసుకున్నారు. కొత్తచెరువు వద్ద ఓ లేఅవుట్ కు దారి కోసం నిర్మించిన బ్రిడ్జి అనుమతి కోసం 75 లక్షలు వసూలు చేశారు. పుట్టపర్తిలో ఈ ఎమ్మెల్యే చేసిన అరాచాకాలు, అక్రమాలు చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోతుంది. 

పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేస్తారని ముందుగానే తెలుసుకుని టౌన్ చుట్టుపక్కల అతి తక్కువ ధరకు వందల ఎకరాలు కొన్నారు. ఇది కదా అసలైన క్విడ్ ప్రోకో అంటే.. పుట్టపర్తి చుట్టుముట్టు ఈయన కొనడమే కాదు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేతో కూడా వందల ఎకరాలు కొనుగోలు చేయించారు. ఇతర జిల్లాలకు చెందిన వైకాపా నాయకులు కూడా జిల్లా కేంద్రం ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు ఇక్కడ భూములు కొన్నారు.  భూ వివాదాలు వీరే సృష్టిస్తారు. తర్వాత వాటిని పరిష్కరించినట్టు కలరింగ్ ఇచ్చి కమీషన్ రూపంలో లక్షలు కొట్టేస్తారు. నాలుగేళ్లలో వందల కోట్లు అక్రమంగా సంపాదించారు. ఇక్కడ సంపాదించిన డబ్బును తీసుకెళ్లి బెంగళూరు, హైదరాబాద్ లో పెట్టుబడి పెడుతున్నారు. 

భూముల్లో కోట్లు గడించిన ఎమ్మెల్యే పేదల బియ్యాన్ని కూడా వదలడం లేదు. బినామీలను ముందు పెట్టి ప్రతి రోజు రేషన్ బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నారు. మిల్లుల వ్యాపారులతో కుమ్మక్కై దందా చేస్తున్నారు. ఇక్కడ రేషన్ బియ్యాన్ని కర్ణాటకలో పాలిష్ చేసి సన్నబియ్యంగా మారుస్తున్నారు. తిరిగి వాటిని ఇక్కడే అమ్ముతున్నారు.  దీంతోపాటు కర్ణాటక డీజీల్ దందాలోనూ ఎమ్మెల్యే గారికి వాటాలు ఉన్నాయి. కర్ణాటకలో 10 రూపాయల తక్కువకు కొని ఇక్కడ 10 రూపాయలు ఎక్కువకు ఇస్తున్నారు. 

పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రధాన సమస్య స్థానికంగా ఉపాధి అవకాశలు లేకపోవడం. ఓడీసీ, నల్లమాడ, అమడగూరు మండలాల నుంచి పెద్దఎత్తున కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇక్కడి నుండి కేరళకు వెళ్లిన కొందరు అక్కడ బిక్షాటన చేసి బతుకుతున్న దౌర్బగ్యం. ఈ పరిస్థి మారాలంటే నియోజకవర్గంలో పెద్దఎత్తున పరిశ్రమలు రావాలి. గతంలో జగన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి అమడగూరు మండలంలో సైన్స్ సిటీ, సోలార్ సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి వేల ఎకరాల భూమి సేకరించారు. పూర్తిగా పరిహారం కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పటివరకు అక్కడ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. తండ్రి ఇచ్చిన హామిని అమలు చేయడంలో జగన్ రెడ్డి పూర్తిగా ఫెయిలయ్యారు. 

పుట్టపర్తి సమీపంలోని కప్పలబండ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు టిడిపి శ్రీకారం చుట్టింటి. ఏపీఐఐసీ ద్వారా 110 ఎకరాలు సేకరించి ఎంఎస్ఎంఈ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసాం. అయితే దురద్రుష్టవశాత్తు ప్రభుత్వం మారిపోవడంతో అవన్ని ముందుకు సాగలేదు. టిడిపి అధికారంలోకి రాగానే పుట్టపర్తి చుట్టూ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తాం. పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి లేకుండా చేస్తాం. 

పుట్టపర్తి నియోజకవర్గంలో అన్ని రకాల పంటలు పండించేందుకు అనువైన భూములు ఉన్నాయి. అయితే సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. హంద్రీనీవా ద్వారా చెరువు నింపి ఉంటే రైతులు బాగుపడేవారు. అయితే పైనున్న జగన్ రెడ్డికి, ఇక్కడున్న ఎమ్మెల్యేకు వారి స్వప్రయోజనాలు తప్ప జనాలు గురించి పట్టదు. టిడిపి హయాంలోనే రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద చెరువైన బుక్కపట్నం చెరువుకు నీరిచ్చాం. హంద్రీనీవా ప్రధాన కాలువ పూర్తి చేశాం. మళ్లీ అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి పుట్టపర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇస్తున్నా. 

పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేసి ఏడాది కావొస్తోంది. సత్యసాయి ట్రస్టు పుణ్యమా అని బిల్డింగులన్ని ఉచితంగా వచ్చేశాయి. కాని జిల్లా కేంద్రంలో ఏ ఒక్క డిపార్ట్ మెంట్లోనూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. చాలా డిపార్ట్ మెంట్లలో ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా లేదు. చాలా విభాగాల్లో ఫైల్స్ పెట్టుకోవడానికి బీరువాలు లేవంటే ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డీఎంహెచ్ వో ఆఫీసులో ఉద్యోగులు మొన్నటివరకు నేలమీద కూర్చొని పనిచేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక వసతులు కల్పిస్తాం. 

పుట్టపర్తి టౌన్ లో ప్రతి ఇంటికీ త్రాగునీరు అందించేందుకు టిడిపి హయాంలో 100 కోట్ల రూపాయిలతో ప్రాజెక్టు పనులు ప్రారంభించాం. 

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేసి రివర్స్ టెండరు ద్వారా వేరే కంపెనీకి అప్పగించారు. ఒక్క రూపాయి నిధులు ఇవ్వకపోవడం వలన పనులు జరగలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే ప్రాజెక్టు పూర్తిచేస్తాం.

టిడిపి హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు మంజూరు చెయ్యకుండా లబ్ధిదారులను వైసిపి ప్రభుత్వం వేధిస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిన మౌలిక సదుపాయాలు కల్పించి ఇళ్లు కేటాయిస్తాం.

సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయ్యి అనేక గ్రామాలకు త్రాగునీరు అందించే పథకాన్ని జగన్ సర్కార్ నిర్వీర్యం చేసింది. కనీసం విద్యుత్ బిల్లులు కట్టడం లేదు, కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పథకాన్ని సక్రమంగా నడిపించి గ్రామాలకు త్రాగునీరు అందిస్తాం. ఈ ప్రాజెక్టు ను నేను దత్తత తీసుకుంటాను. అనంతపురం లో ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీరు అందించే బాధ్యత నాది.

శాసనసభ నా తల్లి ని అవమానించారు. ఎంతో మంది మహిళల్ని వేధించారు. వారిని నేను వదలను.

పోరాడిన వారికే పదవులు. కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఎవరిని వదిలి పెట్టాను.

Comments