ఇంటర్, పదవ తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలి*
*పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి*
*పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు సిబ్బందికి సెల్ ఫోన్లు అనుమతి లేదు*
*ఈ నెల15 నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం*
*రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి*
పుట్టపర్తి, మార్చి 11 (ప్రజా అమరావతి):-
ఇంటర్ మీడియట్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు.
శనివారం విజయవాడలోని రాష్ట్ర సచివాలయం నుంచి ఇంటర్మీడియేట్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మరియు సంబంధిత అధికారులతో
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
స్థానికకలెక్టరేట్లోని స్పందన వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, ఇంటర్మీడియట్ ఆర్ ఐ ఓ సురేష్ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.... ఇంటర్మీడియట్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పగడ్బందీగా నిర్వహించాలన్నారు.
మార్చి 15 నుండి ఏప్రిల్ 04 వ తేదీ వరకు ఇంటర్ మీడియట్,
ఏప్రిల్ 3నుంచి 18 వతేదీ వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అత్యంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షలు జరిగే రోజు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లు మూసి వేయించి 144 సెక్షన్ విధించాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకూడదన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.
విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం 7.00 గంటల నుండి పరీక్షా కేంద్రాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ వారికి సూచించాలన్నారు. ప్రతి జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ నందు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలలో ఎటువంటి మాస్ కాపీలు జరగకుండా ప్లేయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ లను నియమించాలన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్ఎంలను ఏర్పాటు చేసి 108 వాహనం అందుబాటులో ఉంచాలన్నారు. ఇంటర్, పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు లా అండ్ ఆర్డర్ తప్పక పాటించాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అందరూ కృషి చేయాలన్నారు.
ఉదయం 9.00 గంటల నుండి మద్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్ష ఉంటుందని, పరిక్షా కేంద్రాల వద్ద144 సెక్షన్ ఏర్పాటు చేసి పటిష్ట పోలిస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
మార్చి 15 నుండి ఏప్రిల్ 04 వ తేదీ వరకు ఇంటర్ మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఉదయం 7.00 గంటల నుండి పరీక్షా కేంద్రాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ వారికి సూచించారు. పరీక్షా కేంద్రాల్లో బెంచీలు, విద్యుత్ త్రాగునీరు వంటి అన్ని వసతులు ఉండేటట్లు చూడాలని డిఐఈఓ కు తెలిపారు.
జిల్లాలో మొత్తం 39 పరీక్షా కేంద్రాల కు గాను ఇంటర్ మొదటి సంవత్సరం 9307మంది, రెండవ సంవత్సర0 12597మంది, మొత్తం 21904 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరుగుతుందన్నారు.
ఇంటర్ పరీక్షలలో ఎటువంటి అవకతవకలు జరగకుండా 9మంది సిట్టింగ్ స్క్వాడ్, 4 ప్లేయింగ్ స్పాడు,ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, లైవ్ స్ట్రీమింగ్ పర్యవేక్షణలో అత్యంత కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.
ఎస్ హెచ్ ఓ( స్టేషన్ హౌస్ ఆఫీసర్లు) పోలిస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రాలను పోలీస్ ఎస్కార్టు తో పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లాలన్నారు.
పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు చేసి జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలన్నారు.
*ఏప్రిల్ 3నుంచి 18 వతేదీ వరకు పదవ తరగతి పరీక్షలు*
ఉదయం 9:30 నుంచి 12:45 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment