ఏ ఒక్క అర్జీ రీఓపెన్ కాకుండా పరిష్కారం చెయ్యాలి.

 రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);* స్పందనలో వచ్చిన అర్జీలను న్యాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలి. * ఈరోజు స్పందనలో వచ్చిన అర్జీలు.. 112* ప్రతిరోజు స్పందన వైబ్ సైట్ ఓపెన్ చేసి వచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలి.* ఏ ఒక్క అర్జీ  రీఓపెన్ కాకుండా పరిష్కారం చెయ్యాలి.* "1902" జె కె సి అర్జీల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించాలి ... జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలతప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని సంబందిత శాఖాధికారులు రీ ఓపెన్ కాకుండా క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించి అర్జీదారుడు సంతృప్తి చెందేవిధంగా పరిష్కార పత్రాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత అధికారులు ఆదేశించారు.సోమవారం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో  కలెక్టర్ మాధవీలత, డి ఆర్ వో, ఇతర జిల్లా అధికారులుతో కలసి వివిధ సమస్యలు పరిష్కారం కై ప్రజల నుంచి 112 అర్జీలు స్వీకరించామన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో స్పందన లో వచ్చిన అర్జీలలో  పంచాయితీ, డిఆర్డీఏ, డిఎల్ డీవో, పోలీసు శాఖలకు సంబందించి ఎక్కువుగా  అర్జీలు వస్తున్నాయన్నారు. జిల్లా, డివిజన్, మండల్ , క్షేత్ర స్థాయిలోని అధికారులందరూ అర్జీ ఇచ్చిన దరఖాస్తు దారునికి ఖచ్చితమైన పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా సమాదానాన్ని ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు. జిల్లాలో వివిధ శాఖల వారీ పరిష్కరించి ఆన్ లైన్ లో అప్లోడ్ చేస్తున్న ప్రతి అర్జీనీ  రాష్ట్ర స్థాయిలో కూడా పర్యేవేక్షణ చేస్తున్నారన్నారు. ఆయా శాఖలకు సంబందించిన అధికారులు ఒక సారి వచ్చిన అర్జీలు తిరిగి రీఓపెన్ కాకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేవిధంగా పూర్తి స్థాయి సమాచారాన్ని ఆన్ల్ లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారం నిమిత్తం ఉన్న వాటిని సంబందిత ఉన్నత స్థాయి అధికారులు ఆన్ లైన్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. 1902 జేకేసి కి వొచ్చిన ప్రతి అర్జీని సిఎం కార్యాలయం ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.  జేకేసి ద్వారా ప్రజలు అర్జీలు నమోదు, పరిష్కారం అనంతరం ఆన్లైన్ అప్డేషన్ పై సంబంధిత వీడియో పోస్ట్ చేసినట్లు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, పభుత్వ ప్రధాన కార్యదర్శి  సమీక్షలు నిర్వహిస్తున్నందున  జిల్లా అధికారులు శాఖలు వారి అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలు పై ప్రగతి నివేదికలు సమీక్షలకు ముందు గానే అందించే విధంగా సమాయత్తం కావాలన్నారు


జిల్లాలో స్పందనలో ఇప్పటి వరకు 400 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిలో అర్జిలో 48 గంటల్లోగా పరిష్కారం చేయాల్సినవి 7 అర్జీలు, 24 గంటల్లో పరిష్కరించాల్సినవి 6, పదిరోజుల్లో పరిష్కారం చేయాల్సినవి అర్జీలు 318 ఉన్నాయన్నారు. 


స్పందనలో  వచ్చిన కొన్ని అర్జీలు :-నిడదవోలు తిరుగూడెం 18 వ వార్డు నివాసి జి. దుర్గారావు తమ అర్జీలో టిడ్కో గృహాలు నిధులు రాక మద్యలో ఆగిపోయాయని, నిధులు మంజూరు అయితే చేస్తామంటున్నారని అధికారులు తెలియజేస్తున్నారని అర్జీలో కోరారు. దీనిపై కలెక్టరు స్పందిస్తూ మున్సిపల్ కమీషనర్ ధరఖాస్తును పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 


గనసాల కృష్ణ తమ అర్జీలో నిడదవోలు మున్సిపాలిటీ  18 వ వార్డు లో మంచి నీటి వాటర్ ట్యాంక్ శిదిలావస్థలో వుండి ఊసలు కనబడుతున్నాయని, కావున రక్షిత మంచినీటి ట్యాంక్ ను రిపేరు చేయించి తాగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలక్టర్ స్పందిస్తూ వెంటనే తగు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు.


 రాజమహేంద్రవరం రూరల్ మండలం ఉక్కంపేట సాటిలైట్ సిటీ వాసి ఇసాకోటి భద్రం వికలాంగుడి నైనా నాకు అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా  కార్డు మంజూరు చేసి బియ్యం అందించవలసిందిగా తమ అర్జీ లో కోరారు.


 దరఖాస్తుదారుని అర్జీని పరిశీలించి  ఏ ఏ వై కార్డు మంజూరు చేసి దివ్య అందించే విధంగా చెబితే తీసుకోవాలని డి ఎస్ఓ ను కలెక్టర్ ఆదేశించారు.స్పందన కార్యక్రమం డీఆర్వో  జి.  నరశింహులు, డిప్యూటీ కలెక్టరు (టూరిజం) స్వామినాయుడు,  డి ఎం హెచ్ ఓ డా. కే వెంకటేశ్వరరావు, టీబి, డిసిహెచ్ఒ డా.సనత్ కుమారి, సీపీఓ కె.ప్రకాష్ రావు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ ఈ  డి.బాలశంకర్ రావు ,  డీ పి వో  పి. జగదాంబ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవ రావు, డిహెచ్ఓ వి.రాథాకృష్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ జీ టి సత్యగోవిందం, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్, డిఆర్డిఏ పీడి ఎస్. సుమలత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె. విజయ కుమారి,  డి ఎల్ డిఓ వీణాదేవి, జిల్లా ట్రెజరీ అధికారి సత్యనారాయణ, పలువురు జిల్లా శాఖా అధికారులు , సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Comments