కీలకం కానున్న రెండవ ప్రాధాన్యత ఓటు

 *కీలకం కానున్న రెండవ ప్రాధాన్యత ఓటు*


బొబ్బిలి , మార్చి 12 (ప్రజా అమరావతి):-

మార్చి 13న జరగబోయే,ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, రెండవ ప్రాధాన్యత ఓటు కీలకం కానుంది.. 37 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు మొదటి వరుస సంఖ్యలో ఉండగా, 34 మంది స్వతంత్ర అభ్యర్థులను అక్షరమాల ప్రకారం ఏర్పాటు చేశారు.అయితే ప్రతి ఓటరు కూడా తనకు నచ్చిన అభ్యర్థికి నచ్చిన ప్రాధాన్యత ఓటును వేసుకునే వెసులుబాటు ఉంది. మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసిన, ఇక రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేస్తారు అనేది సందిగ్ధంగా ఉంది.గతంలో కూడా రెండవ ప్రాధాన్యత ఓట్లను అనుసరించి, గెలుపోవటములు నిర్ణయించబడ్డాయి. ప్రధాన పార్టీలకు మొదటి ప్రాధాన్య ఓటు ఒకవేళ వేసిన, రెండవ ప్రాధాన్యత ఓటు స్వతంత్ర అభ్యర్థికి వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇలా చూసుకుంటే స్వతంత్ర అభ్యర్థులలో  మీడియా జర్నలిస్టులు,

ప్రజా సంఘాలు బలపరిచిన నాయకులు, సామాజిక సేవా కార్యకర్తలు, రాజకీయ పార్టీలు బలపరిచిన నాయకులు, కొంతమంది మేధావులు, ఉన్నత విద్యావంతులు ఉన్నారు.రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరికి పడుతుందో అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి సందిగ్ధంగా ఉంది.మొదటి ప్రాధాన్యత ఓటు ఎలాగూ ఎక్కువగా పడే అవకాశాలు లేవు కాబట్టి, రెండవ ప్రాధాన్యత ఓటుపై అభ్యర్థులందరూ దృష్టి పెట్టారు.ఈ విధంగా ఎక్కువగా రెండవ ప్రాధాన్యత ఓట్లు లభిస్తే గెలుపు సులభమని అభ్యర్థుల ఆలోచన.ఎన్నికలు పూర్తిస్థాయిలో పారదర్శకంగా జరిగితే ఇండిపెండెంట్ ల ఓట్లు కీలకం కానున్నాయి.ఇండిపెండెంట్ లకు ఎక్కువ స్థాయిలో ఓటింగ్ జరిగితే ప్రధాన పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బలంగా ప్రజల్లోకి వెళ్లి ఓటు కోసం అభ్యర్థించడం ఒక ప్రధాన అంశం.వెరిసి, ఇండిపెండెంట్ లకు మొదటి ఓటు వేస్తే,రెండో ప్రాధాన్యత ఓటు ఏ పార్టీ అభ్యర్థికి పడతాయి అనేది ఇప్పుడు ఉత్తరాంధ్ర యావత్తు చర్చనీయాసంగా ఉంది.గెలుపోటములు పక్కన పెడితే 37 మంది అభ్యర్థులు కూడా మనసా వాచా కర్మ గెలవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఎన్నికలు పారిదర్శకంగా జరపడానికి అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది.ఎలాగూ సెలవుదినంగా ప్రకటించారు కాబట్టి, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. 300 కి పైగా పోలింగ్ బూత్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అభ్యర్థులు అన్ని బూతులకు వెళ్లే అవకాశం లేదు కాబట్టి, వారికి ఓటింగ్ ఎక్కువగా ఎక్కడపడితే, అక్కడే వారు ఉండి ఎక్కువ ఓటింగ్ కోసం ప్రయత్నాలు చేసే విధంగా ఆలోచిస్తున్నారు.అందరూ చదువుకున్న ఓటర్ లే కాబట్టి తప్పకుండా ఆలోచించే ప్రతి ఒక్కరు ఓటు వేస్తారని నమ్మకం అభ్యర్థుల్లో ఉంది.బయటకు ధైర్యంగా ఉన్న, ఎవరికి వారు ఆందోళనలోనే ఉన్నారన్న విషయం తేటతెల్లమవుతుంది.. ఎటోచ్చి గెలుపోటములు నిర్ణయించే శక్తి రెండో ప్రాధాన్యత ఓటుకి ఉంది కావున, అభ్యర్థులందరూ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉత్తరాంధ్రకే కీలకమైన ఎమ్మెల్సీ పదవిని ఎవరు సొంతం చేసుకుంటారో,మరొక నాలుగు రోజుల్లో చూడబోతున్నాం..


 


Comments