నెల్లూరు మార్చి 25 (ప్రజా అమరావతి);
ప్రజల సర్వతోముఖాభివృద్ధి, గ్రామాల సమగ్ర అభివృద్దె లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నద
ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు.
శనివారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం గురివిందపూడి గ్రామంలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కాకాణి కి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. తోలుత గ్రామంలో 79.30 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన గ్రామ సచివాలయం, ఆర్ బి కె ,వై యస్ ఆర్ హెల్త్ క్లినిక్ లకు మంత్రి కాకాణి శంఖుస్థాపన చేసారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని విచారిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకమై ముందుకు సాగారు.
ఈ సందర్బంగా మంత్రి కాకాణి మీడియా తో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఆలోచనకు సైతం రానటువంటి పధకాలను అమలు చేస్తున్నామన్నారు. సామాజిక న్యాయంతో కూడిన సంక్షేమ సాధికారత ప్రస్తుత ప్రభుత్వంలోనే సాధ్యమైoదన్నారు. ప్రజల తలసరి ఆదాయం పెరిగి వారి జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధరను మించి ఆదాయం సమాకూరుతుందన్నారు. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న ఏ ప్రభుత్వమైనా ప్రజల ముందుకెళ్లటానికి భయపడుతుందని, కానీ గడప గడప కు మన ప్రభుత్వమనే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలేమిటని విచారించే ఏకైక ప్రభుత్వం తమదన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలని తపనపడే ప్రభుత్వం తమదన్నారు. ప్రజల సర్వతోముఖాభివృద్ధి, గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సమత, యం పి డి ఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సుధీర్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment