మహిళా చైతన్యానికి కృషిచేసిన భారతకోకిల సరోజినీనాయుడు



మహిళా చైతన్యానికి కృషిచేసిన భారతకోకిల సరోజినీనాయుడు



- యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి

- ఖనిలో ఘనంగ జరిగిన సరోజినీ నాయుడు 74వ వర్ధంతి


గోదావరిఖని మార్చ్ 2 (ప్రజా అమరావతి): భారత స్వాతంత్ర సమరయోదురాలు , కవయిత్రి, భారతకోకిల సరోజినీనాయుడు గారు మహిళా చైతన్యానికి ఎనలేని కృషి చేసినారు అని యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి కొనియాడారు. గురువారం గోదావరిఖనిలో జరిగిన సరోజినినాయుడు 74వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగ నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా జనగామ తిరుపతి మాట్లడుతు భారతదేశానికి చెందిన గొప్ప రాజకీయవేత్త, దేశభక్తురాలు కవయిత్రి సరోజినీ నాయుడు గారు అని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన పాత్రను పోషించారు అని మహాత్మా గాంధీజీ గారు వారి సేవలకు, కవితలకు గాను సరోజినీ నాయుడుకు నైటింగేల్ ఆఫ్ ఇండియా (భారత కోకిల)అని బిరుదు ఇచ్చారు అని తెలిపారు.

సరోజినీ నాయుడు 13 ఫిబ్రవరి 1879వ సంవత్సరంలో హైదరాబాద్ లోని అఘోరేనాథ్ ఛటోపాధ్యాయ మరియు వరద సుందరిదేవి అనే దంపతులకు జన్మించారు అని నాయుడుగారి తల్లి తండ్రులు బాంగ్లాదేశ్ కి చెందిన వారు అని పేర్కొన్నారు.

సరోజినీ నాయుడు గారి యొక్క సోదరుడు వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ కూడా స్వాతంత్ర పోరాటంలో చాలా కృషి చేసారు అని అన్నారు.

సరోజినీ నాయుడు గారు కేవలం 25 సంవత్సరాల వయస్సులో ఒక మంచి వక్తగా పేరు సంపాదించారు అని స్వాతంత్రపోరాటం కోసం, మహిళల హక్కుల కోసం తరచుగా మాట్లాడేవారు అని కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవటంలో కూడా సరోజినీ నాయుడు గారు ముందు ఉండేవారు అని అన్నారు. 1911 వ సంవత్సరంలో నాయుడు గారు చేసిన సామజిక సేవకు గాను కైసరేహింద్ మెడల్ సంపాదించారు అని తెలిపారు.

సరోజినీ నాయుడు గారు తన సహోద్యోగి అయిన అన్నీ బిసెంట్తో కలిసి జాతి, మత మరియు డబ్బు భేదాలు లేకుండా ఓటు హక్కు అందరికి ఉండాలని పోరాటం చేశారు అని అన్నారు.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండవ మహిళ ప్రెసిడెంట్గా కూడా ఎన్నుకోబడ్డారు అని ప్రముఖ స్వాతంత్ర పోరాట సమర యోధులైన గాంధీజీ,గోపాల్ కృష్ణ గోఖ్లే, రవీంద్రానాథ్ ఠాగూర్ తో కలిసి పనిచేసారు అని పేర్కొన్నారు.ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో,ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ మరియు సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు అని తెలిపారు. 1925 వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నుకోబడ్డారు అని అన్నారు.

1927 వ సంవత్సరంలో అఖిల భారత మహిళాసదస్సును సరోజినీనాయుడు గారు ప్రారంభించారు అని అన్నారు.

భారతదేశానికి స్వాతంత్రం లభించిన తరవాత ఉత్తరప్రేదేశ్ కు  ఎన్నుకోబడ్డ మొట్ట మొదటి మహిళా గవర్నర్ అని తెలిపారు.

1949 మార్చి 2న గుండెపోటుతో లక్నోలో తుదిశ్వాస విడిచారు అని వారిని స్మరించుకుంటు విచారం వ్యక్తం చేశారు. సరోజినినాయుడు గారి స్ఫూర్తి, పట్టుదల, దేశభక్తి నేటియువత,మహిళలు కలిగి ఉండాలి అని యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామతిరుపతి పిలుపునిచ్చారు.

Comments