పోలింగ్ కేంద్రాలలో అవసరమైన సామాగ్రిని సిద్ధం చేయండి :జిల్లా కలెక్టర్

 పోలింగ్ కేంద్రాలలో అవసరమైన సామాగ్రిని సిద్ధం చేయండి :జిల్లా కలెక్టర్ 


 


పుట్టపర్తి, మార్చ్ 09 (ప్రజా అమరావతి): పోలింగ్ ప్రిసైడింగ్ అధికారుల  చెక్లిస్ట్ ఆధారంగా సూచించిన దాదాపు  30 రకాల వస్తువులను తప్పనిసరిగా  డిస్ట్రిబ్యూషణ్ కేంద్రాల నుండి   పంపిణీ జరిగేలా చూడాలని, జిల్లా కలెక్టర్  బసంత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం  సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో పోలింగ్ కేంద్రాల వారిగా సిద్ధం చేస్తున్న పోలింగ్ మెటీరియల్ ,  కలెక్టరేట్ కు చేరుకున్న బ్యాలెట్ పేపర్ల ,(jumbo) జుంబో బ్యాలెట్ బాక్స్ ను  జిల్లా కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. 

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ నుండి సిద్దం చేసి  తరలిస్తున్న పోలింగ్ మెటీరియల్  ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాలకు చెక్ లిస్ట్ మేరకు అందేలా చూడాలని అన్నారు.  ఇప్పటికే పోలింగ్ మెటీరియల్ టీచర్ ఉపాధ్యాయ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలకు పింక్ కలర్, పట్టభద్రుల నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలకు తెలుపు రంగు బ్యాగులలో సిద్ధం చేసిన పోలింగ్ మెటీరియల్ జిల్లా కలెక్టర్ చెక్ లిస్ట్ ఆధారంగా ప్రతి వస్తువును చెక్ చేసి పలు సూచనలు  చేశారు.


Comments