అమరావతి (ప్రజా అమరావతి);
*జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం*
*నేటి నుండి బడి పిల్లలకు ఉదయం పూట రాగి జావ*
*సీఎం క్యాంప్ కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్*
*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, విద్యార్ధులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*
*బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి*
అందరికీ నమస్కారం, ఈ రోజు సీఎంగారి ఆలోచన మేరకు జగనన్న గోరుముద్దలో రోజుకొక మెనూతో సుమారు 15 వెరైటీలతో పాటు రాగిజావ ఇవ్వాలని (వారానికి మూడు రోజుల పాటు) నిర్ణయించడం శుభపరిణామం. దీనికి సత్యసాయి ట్రస్ట్ కూడా భాగస్వామి కావడంపై వారికి కూడా ధన్యవాదాలు. చదువుతోపాటు పౌష్టికాహారం ఇవ్వాలన్న ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం
ఇది. ఏ ఒక్క విద్యార్ధి కూడా పేదరికం వల్ల చదువుకు దూరం కాకూడదని ఎన్నో రిఫామ్స్ తీసుకొస్తున్న ప్రభుత్వం ఇది. కరిక్యులమ్, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ, నాడు నేడు, విద్యా దీవెన కిట్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే. ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలు చూస్తే విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం. విద్య అనేది సంక్షేమం కాదు పెట్టుబడి అని సీఎంగారు నమ్మి అమలుచేస్తున్నారు. విద్య గురించి గతంలో కేరళ, తర్వాత ఢిల్లీ కానీ ఇప్పుడు ఏపీ గురించి మాట్లాడుకుంటున్నారు. తల్లిదండ్రుల కంటే మిన్నగా సీఎంగారు విద్యార్ధుల గురించి ఆలోచించి ముందుకెళుతున్నారు. సీఎంగారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ధ్యాంక్యూ.
*ఆర్.జే.రత్నాకర్, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్*
అందరికీ నమస్కారం, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ తరపున ఈ గొప్ప కార్యక్రమంలో మేం భాగస్వామ్యం కావడంపై చాలా ఆనందంగా ఉంది. బాబా భక్తులు కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎంగారి నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. మీరు చేస్తున్న అనేక కార్యక్రమాలు పిల్లలకు చాలా తోడ్పాటుగా ఉంటున్నాయి. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద లక్షల రూపాయిలు వెచ్చించి విద్యార్ధులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించడం గొప్ప విషయం. మీ నాయకత్వంలో ఇలాంటి అనేక గొప్ప కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ధ్యాంక్యూ, జైహింద్.
*ధనుశ్రీ,, 8 వతరగతి విద్యార్ధిని, జెడ్‌పీహెచ్‌ఎస్, కొత్తచెరువు, శ్రీసత్యసాయి జిల్లా*
సీఎం సార్, రాగి జావ చాలా బావుంది, ఏపీ ప్రభుత్వం విద్యావ్యవస్ధలో అనేక మార్పులు తీసుకొస్తుంది, అమ్మ ఒడి, నాడు నేడు, జగనన్న గోరుముద్ద ఇలా అనేక రకాలుగా మార్పులు జరిగాయి, గోరుముద్దలో 15 వెరైటీలు, గుడ్లు, చిక్కీ ఇలా అన్నీ ఇస్తున్నారు. నాడు నేడు లో భాగంగా మా స్కూల్స్‌లో టాయిలెట్స్ చక్కగా ఉన్నాయి, నిర్వహణ బావుంది. బాలికలకు శానిటరీ నాప్కిన్స్ కూడా ఇస్తున్నారు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, ఈ ప్రభుత్వ పాఠశాలలో చదవుకోవడాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను. నేను భవిష్యత్‌లో బాగా చదువుకుని ఈ ప్రభుత్వంలో పనిచేయాలని భావిస్తున్నాను. జగన్ మామయ్య నేను కన్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అన్న విధంగా ఏపీ ప్రజలు కోరుకున్నారు, మీరు పేదలకు ఉపయోగపడేలా అనేక పథకాలు తీసుకొచ్చారు. మాట తప్పను మడమ తిప్పను అన్న విధంగా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు. 2024లో కూడా జగన్ మామ మంచి మెజార్టీతో గెలుపొందాలని నేను బాబాను ప్రార్ధిస్తున్నాను. ధ్యాంక్యూ జగన్ మామయ్య.
*హైమావతి, 9 వ తరగతి విద్యార్ధిని, రామభద్రాపురం హైస్కూల్, విజయనగరం జిల్లా*
నమస్తే సార్, నేను ఈ రోజు ఉదయమే రాగి జావను రుచి చూశాను, నా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఇలా తాగించేది, నేను చదువుతున్న స్కూల్‌లో గతంలో ఇన్ని సౌకర్యాలు లేవు, గతంలో స్కూల్‌లోని తరగతి గదులు ఇరుకుగా ఉండేవి, ఆరుబయట కూడా చదువుకునేవాళ్ళం కానీ ఇప్పుడు విశాలమైన తరగతి గదులు, చక్కని టాయిలెట్స్, ఆరోగ్యకరమైన వాతావారణం ఉన్నాయి. గతంలో టెక్ట్స్‌బుక్స్ సకాలంలో ఇవ్వకపోవడం వల్ల సిలబస్ పూర్తయ్యేది కాదు కానీ ఇప్పుడు అన్నీ టైంకి ఇవ్వడం వల్ల చక్కగా చదువుకోగలుగుతున్నాం. మాకు ఇప్పుడు డిక్షనరీలు కూడా ఇచ్చారు, మాకు ఇప్పుడు మూడు జతల యూనిఫామ్స్ ఇచ్చారు, మెనూ చూస్తే అప్పుడు పప్పు, రసం మాత్రమే కానీ ఇప్పుడు రోజుకోరకమైన మెనూ, నాకు వెజిటెబుల్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, మా ఇంట్లోకన్నా నాకు ఇక్కడ పౌష్టికాహారం అందుతుంది. మీరు వచ్చిన తర్వాత ప్రెవేట్ స్కూల్స్ విద్యార్ధులతో పోటీపడుతున్నాం. వారికన్నా మెరుగ్గా చదువుకునేలా తీర్చిదిద్దుతున్నారు. దిశ యాప్ వినియోగం, మహిళా పోలీసులు ఇలా ఇవన్నీ సఖి మీటింగ్స్‌లో మాకు చెప్పారు. టాయిలెట్స్ కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి, మాకు శానిటరీ నాప్కిన్స్ కూడా ఇస్తున్నారు. ధ్యాంక్యూ సార్.
*కాంచన, విద్యార్ధి తల్లి, నరసరావుపేట, పల్నాడు జిల్లా*
నమస్తే జగనన్నా, మీతో మాట్లాడతానని కలలో కూడా అనుకోలేదు, మా బాబు ఇక్కడ జెడ్పీ స్కూల్‌లో చదువుతున్నాడు, విద్యాకానుక కింద మా బాబుకు 3 జతల యూనిఫామ్స్ ఇచ్చారు, బ్యాగు, బెల్ట్, ఇలా అన్నీ ఇచ్చారు, కొన్ని లక్షల మంది పిల్లలకు మీరు మేనమామ అయ్యారు, మిమ్మల్ని ఏం అడగకుండానే అన్నీ చూసుకుంటున్నారు. ప్రతి అడుగు అడుగునా సొంత మేనమామలా చూసుకుంటున్నారు. నేను ఇంటి నుంచి క్యారేజ్ పనిలేకుండా చక్కటి భోజనం ఇస్తున్నారు. చందమామ వెన్నెల మాత్రమే ఇస్తుంది కానీ మా జగన్ మామ పిల్లలకు ఇవన్నీ ఇస్తున్నారు. గోరుముద్దలో చక్కటి భోజనం ఇస్తున్నారు, మీరు పోషక విలువలతో కూడిన ఆహారం ఇవ్వడం వల్ల మా అబ్బాయి నేషనల్ ప్లేయర్‌గా ఎదిగాడు. నాడు నేడు కింద చాలా చక్కగా స్కూల్స్‌ను మార్చారు, మా బాబుకు ట్యాబ్ కూడా వచ్చింది, మేం చాలా సంతోషిస్తున్నాం, ఆడపిల్లలకు బ్లడ్‌టెస్ట్‌లు చేసి ఐరన్ ట్యాబెట్స్ ఇస్తున్నారు, తల్లికడుపులో ఉన్నప్పటినుంచి మీరు రక్షణ కల్పిస్తున్నారు. ధ్యాంక్యూ సార్.
addComments
Post a Comment