పేద బడుగు బలహీన వర్గాలకు అండగా వుంటూ వారి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


పేద బడుగు బలహీన వర్గాలకు అండగా వుంటూ వారి  అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు


చేస్తున్నట్లు  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు  కాకాణి గోవర్ధన రెడ్డి తెలిపారు. 


సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు  మండలం, గురువిందపూడి గ్రామ పరిధిలో రూ.40 లక్షలతో నిర్మించిన  సిమెంట్ రోడ్లను, రూ.20 లక్షలతో నిర్మించిన  సిసి రోడ్లను ప్రారంభించడంతో పాటు రూ.25 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సామాజిక భవనానికి  ఆదివారం సాయంత్రం మంత్రి శ్రీ  కాకాణిగోవర్ధన్ రెడ్డి  శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి  శ్రీ గోవర్ధన్ రెడ్డి గురివింద  గ్రామంలో 2వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ,  వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  పాల్గొనేందుకు వచ్చిన మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. 


అనంతరం మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా వుంటూ వారి  అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు గ్రామంలో ప్రజల సమస్యలను తెలుసుకొని అవసరమైన సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు, త్రాగు నీరు, సాగు నీరు, విద్యుత్ సౌకర్యం  సంపూర్ణంగా కల్పించేలా   చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. అందులో బాగంగా ఈ గ్రామంలో నిలిచిపోయిన అభివృద్ది పనులను ఒక్కొక్కటి పూర్తి చేయడం  జరుగుచున్నదన్నారు.  దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లను వాలంటీర్ వ్యవస్థ ద్వారా  అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి  దక్కుతుందన్నారు. 2024 జనవరి నుండి ముఖ్యమంత్రి చెప్పిన విధంగా 3 వేల రూపాయలు పింఛన్ అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అత్యంత అధికంగా పింఛన్ ఇస్తున్న రాష్ట్రం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని మంత్రి తెలిపారు. అన్నీ వర్గాల  ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.   గురివింద పూడి గ్రామంలో గత నాలుగు సంవత్సరాల కాలంలో  3.35 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడం జరిగిదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబం వద్దకు వెళ్ళి  సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును తెలుసుకోవడంతో పాటు ఏదైనా సాంకేతిక కారణాల వలన సంక్షేమ పధకాలు అందక పోతే, సంబంధిత లబ్ధిదారునికి అందించడం జరుగుచున్నదన్నారు.  రానున్న రోజుల్లో  నియోజక వర్గంలోని అన్నీ గ్రామాల సంపూర్ణ  అభివృద్ది, ప్రజల సంక్షేమమే ధ్యేయంతో పనిచేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




Comments