సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడిగా పుల్లన్నగారి శ్రీనివాస్ రెడ్డి...

 సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడిగా పుల్లన్నగారి శ్రీనివాస్ రెడ్డి...



మెదక్/పాపన్నపేట (ప్రజా అమరావతి);, సింగపూర్ తెలుగు సమాజం (STS) ఉపాధ్యక్షుడిగా పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేట గ్రామవాసి ఎంపికయ్యారు. ఇటీవల సింగపూర్ తెలుగు సమాజం తరఫున ఎన్నికలు నిర్వహించగా, ఆదివారం ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇందులో పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేట గ్రామానికి చెందిన పుల్లన్న గారి శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా సింగపూర్ సిటీ బ్యాంకులో

ఉన్నత పదవిలో ఉన్నారు.

అయితే సింగపూర్లో 1975 లో తెలుగువారి అందరితో కలిసి సింగపూర్ తెలుగు సమాజం స్థాపించారు. దీని ద్వారా తెలుగువారి అందరిని ఏకతాడి పై తీసుకురావడమే కాకుండా, తెలుగు సాంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుతున్నారు. దీనికి తోడు తెలుగు పండుగలను అత్యంత వైభవంగా జరపడానికి, పండుగలలో తెలుగు వారు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడానికి ఈ సమాజం విశేషంగా కృషి చేస్తుంది. అంతేకాకుండా ఎవరైనా ఆపదలో ఉంటే తగిన సాయం చేయడంలో ఈ సమాజం ముందంజలో ఉంటుంది ,కరోనా సమయంలో సైతం అక్కడి నుండి తెలుగువారిని తమ తమ ప్రాంతాలకు తరలించడానికి ఫ్లైట్ ను సైతం ఏర్పాటు చేసిన ఘనత ఈ STS కు ఉంది. సింగపూర్ లో సుమారు 40 నుండి 50 వేల మంది తెలుగువారు ఉండగా, ఈ సింగపూర్ తెలుగు సమాజం లో సుమారు 10 వేల పై చీలుకు ప్రజలు సభ్యత్వం కలిగి ఉండగా, 9000 మందికి ఓటు హక్కు ఉంది. అయితే ఇటీవల సింగపూర్ తెలుగు సమాజం ఎస్ టి ఎస్ కు ఎన్నికలు నిర్వహించగా విజయవాడకు చెందిన బొమ్మ రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నిక కాగా, పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేట గ్రామానికి శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అయితే శ్రీనివాస్ రెడ్డి తండ్రి పుల్లన్న గారి మోహన్ రెడ్డి కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ సర్పంచ్ గా సొసైటీ చైర్మన్ గా ప్రజాసేవ చేస్తున్నారు. ఇక శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పుల్లన్న గారి ప్రశాంత్ రెడ్డి సైతం పాపన్నపేట మండలంలో టిఆర్ఎస్ లో ప్రముఖ నాయకుడుగా కొనసాగుతున్నారు. వీరి సతీమణి ప్రస్తుతం పాపన్నపేట  మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా కొనసాగుతుంది. వీరి కుటుంబం గత కొన్ని దశాబ్దాలుగా మల్లంపేట రాజకీయాలనే కాకుండా మండల రాజకీయాలను సైతం శాసిస్తుంది. ఏది ఏమైనా శ్రీనివాస్ రెడ్డి సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడిగా ఎంపిక కావడం పట్ల మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments