చిన్నారులకు మరింత ఆరోగ్యం.

 *జగనన్న గోరుముద్ద కింద రాగిజావ పంపిణీపై స్టోరీ..*

పుట్టపర్తి(శ్రీ సత్యసాయి జిల్లా).


*చిన్నారులకు మరింత ఆరోగ్యం*



*: జగనన్న గోరుముద్దలో రాగిజావ పంపిణీకి శ్రీకారం*


*: బడి పిల్లలకు పోషకాహారలోపం సమస్యలకు చెక్*


*: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన చిన్నారులు*


కొత్తచెరువు (శ్రీ సత్యసాయి జిల్లా), మార్చి 21 (ప్రజా అమరావతి):


*పేద విద్యార్థుల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. చిన్నారులను మరింత ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న గోరుముద్దలో రాగిజావ పంపిణీకి శ్రీకారం చుట్టింది. బడి పిల్లలకు ఎదురవుతున్న పోషకాహారలోపం సమస్యలకు చెక్ పెడుతూ రాగిజావ పంపిణీకి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే జగనన్న గోరుముద్ద కింద మధ్యాహ్న భోజనం అందిస్తూ 5 రోజులపాటు కోడిగుడ్డు, 3 రోజుల పాటు చిక్కి అందిస్తూ ఉండగా, తాజాగా మూడు రోజులపాటు రాగి జావ పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనంలో సమూల మార్పులు చేసి జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతిరోజు మెనూ మార్చి బలవర్ధకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తుండగా, ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలను అందించి విద్యార్థుల్లో రక్తహీనత, పోషకాల లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు అంటే మంగళ, గురు, శనివారాల్లో బెల్లంతో కూడిన రాగి జావను విద్యార్థులకు ప్రభుత్వం అందించేలా ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 2,034 పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద కింద 1,46,744 మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతోంది. రాగి జావ పంపిణీ కోసం శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారి సహకారంతో ప్రభుత్వం చర్యలు చేపట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జగనన్న గోరుముద్ద కింద రాగి జావ పంపిణీతో విద్యార్థులను మరింత ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలు తెలిపారు.*


*1. చాలా సంతోషంగా ఉంది..*

*: వైష్ణవి, 9వ తరగతి విద్యార్థిని, గర్ల్స్ హైస్కూల్, కొత్తచెరువు మండలం, శ్రీ సత్యసాయి జిల్లా.*


జగనన్న గోరుముద్దలో రాగిజావ పంపిణీ చేయడం పట్ల చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ నాన్న రైతులు, నన్ను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో జగనన్న గోరుముద్దలో కోడిగుడ్లు, చిక్కి వంటి పోషకాహారం అందిస్తుండగా, గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా రాగి జావ అందించడం ఎంతో గొప్ప విషయం. దీని ద్వారా విద్యార్థులకు మరింత పోషకాహారం లభిస్తుంది. పేద విద్యార్థుల చదువుకు ఎంతగానో కృషి చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు.


*2. రాష్ట్ర ముఖ్యమంత్రి కృతజ్ఞతలు*

*: వి. వర్షిణి, 9వ తరగతి విద్యార్థిని, గర్ల్స్ హైస్కూల్, కొత్తచెరువు మండలం, శ్రీ సత్యసాయి జిల్లా.*


విద్యార్థినీ విద్యార్థుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు జగనన్న గోరుముద్ద కింద రాగిజావ పంపిణీ చేయడం ఎంతో గొప్ప విషయం. గతంలో ఎప్పుడూ ఇలా ప్రభుత్వ పాఠశాలలో పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించలేదు. జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతిరోజు మెనూ మార్చి బలవర్ధకమైన, మెరుగైన, రుచికరమైన నాణ్యమైన పౌష్టికాహారాన్ని జగనన్న ప్రభుత్వం అందిస్తోంది. బడి పిల్లలకు ఉదయం పూట రాగిజావ అందించడంతో విద్యార్థుల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. మా అమ్మానాన్నలు రైతులు. మా కుటుంబానికి అమ్మబడి, వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి కలిగింది. విద్యార్థుల చదువుకు ముందుండి సహాయం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు.


*3. రాగి జావతో ఎంతో ఉపయోగం*

*: దినేష్ కుమార్ ల్, 10వ తరగతి విద్యార్థి, ఏపీ మోడల్ స్కూల్, జగరాజు పల్లి, పుట్టపర్తి మండలం, శ్రీ సత్య సాయి జిల్లా.*


జగనన్న గోరుముద్ద కింద అందిస్తున్న రాగి జావ విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యానికి, సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న విద్యార్థులకు రాగిజావ అందించడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. మా కుటుంబానికి వైఎస్ఆర్ రైతు భరోసా, అమ్మ ఒడి, విద్యా కానుక తదితర పథకాల కింద లబ్ధి కలిగింది. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగనన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.



Comments