*స్వర్ణకారుల సంక్షేమమే నారా లోకేష్ లక్ష్యం*
*లక్ష్మీనరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా రూ.2లక్షల విలువైన వృత్తిపరికరాలు అందజేత*
మంగళగిరి, మార్చి 22 (ప్రజా అమరావతి): మంగళగిరి నియోజకవర్గంలో స్వర్ణకారుల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందుకువెళుతున్నారని ఆ పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. బుధవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక షరాఫ్ బజారులోని లక్ష్మీనరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో లోకేశ్ ఆర్థిక సహకారంతో 10 మంది స్వర్ణకారులకు రెండు లక్షల రూపాయల విలువైన వృత్తిపరికరాలను అందజేశారు. స్వర్ణకార లబ్ధిదారులు బిట్రా శివనాగేశ్వరరావు, అడిగొప్పుల విజయ్ కుమార్, చిలుకోటి సూరిబాబులకు ఒక్కో గోల్డ్ మెల్టింగ్ మెషిన్, గుంటి సత్యనారాయణ, కోడేటి గిరిలకు చేరొక హ్యాండ్ కటింగ్ మెషిన్, దామర్ల పరమేష్, సాయి ప్రాతూరి, సీహెచ్ రాఘవ, దాశెట్టి ఈశ్వర్ లకు ధర్మకాటాలు తలాఒకటి నాయకులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్ధయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, నాయకులు దామర్ల రాజు, గుత్తికొండ ధనుంజయరావు, కాండ్రు శ్రీనివాసరావు, వింజమూరి ఆషాబాల, షేక్ రియాజ్ లతోపాటు జ్యుయలరీ అసోసియేషన్ కార్యదర్శి అవ్వారు సత్యకృపాల్ డాండే, లక్ష్మీనరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గుంటి నాగరాజు, ఉపాధ్యక్షుడు దామర్ల సతీష్, కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు, కోశాధికారి పడవల మహేష్, సంయుక్త కార్యదర్శి దామర్ల మోహన్, పీఆర్వో కందుల నాగార్జున, సమన్వయకర్త తిరువీధుల సతీష్, డైరెక్టర్లు చెల్లూరి సత్యనారాయణ, బిట్లా దుర్గారావు, గొట్టుముక్కల నాగరాజు, అవ్వారు శ్రీనివాసరావు, కౌతరపు రమేష్, నందం ఆదినారాయణ, చెరుకు పూర్ణ, గూండ గణపతి, కారంపూడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, స్వర్ణకార సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ 2019 ఎన్నికల తర్వాత గెలుపోటములతో సంబంధంలేకుండా స్వర్ణకారుల సంక్షేమం కోసం లోకేశ్ సమగ్రమైన ప్రణాళిక సిద్ధంచేశారని గుర్తుచేశారు. మంగళగిరిలో చేనేతల తర్వాత స్వర్ణకార వృత్తిదారులే అధికంగా ఉన్నారని, వారికి మెరుగైన భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో లక్ష్మీనరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించారని తెలిపారు. కరోనా విపత్కర సమయంలో రూ. 10లక్షల విలువైన వస్తు సామగ్రిని స్వర్ణకారులకు అందించారని చెప్పారు. 200 మంది స్వర్ణకారులకు ప్రమాద బీమా చేయించారని తెలిపారు. సొసైటీ సభ్యులెవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.2లక్షల ప్రమాద బీమా, గాయపడితే రూ.50వేల ఆర్థికసాయం అందుతుందన్నారు. అలాగే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల స్కీములు సభ్యులకు తెలియపరిచడంతోపాటు స్వర్ణకారుల పనిప్రదేశంలో మెరుగైన వసతుల కల్పనకు కృషిచేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం సొసైటీలో 275 మంది స్వర్ణకార సభ్యులు ఉన్నారని, నారా లోకేశ్ సహకారంతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని సొసైటీ ప్రతినిధులు తెలిపారు.
addComments
Post a Comment