వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఉండవల్లి కుర్రాడు

 *వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఉండవల్లి కుర్రాడు


*


-  *రాణి చలనచిత్రంతో ఆహా ఓటిటిలో గుర్తింపు*

-  *రేపు 'రిచి గాడి పెళ్లి' విడుదల*

-  *ఉండవల్లి సెంటర్ రామకృష్ణ థియేటర్ లో సందడి*

-  *చిత్ర యూనిట్ ఉండవల్లికి రాక*

- *యువహీరో కిషోర్ మారిశెట్టి*


తాడేపల్లి (ప్రజా అమరావతి);


ఉండవల్లికి చెందిన యువ హీరో కిషోర్ మారిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన చలన చిత్రం రిచిగాడి పెళ్లి ఉండవల్లి సెంటర్లో మార్చి మూడున రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కిషోర్ మారిశెట్టి మాట్లాడుతూ ఇప్పటికే తను నటించి నిర్మించిన చలనచిత్రం రాణి ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యి ట్రెండింగ్లో దూసుకొని ముందుకు వెళ్తుండం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కెఏస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై కె ఎస్ హేమరాజ్ (KS Hemaraj) దర్శకత్వంలో కిషోర్ మారిశెట్టి,నవీన్ నేని, సత్య ఎస్ కె, ప్రణీత పట్నాయక్, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, బన్నీ వాక్స్ నటీనటులు గా నటించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా ‘రిచి గాడి పెళ్లి’. డిఫరెంట్ టైటిల్ & ట్రైలర్ తో ఇప్పటికే ప్రేక్షకులని ఆకట్టుకుంది అని తెలిపారు.

ఈ చిత్రంలోని పాటలు మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకుల ఆదరణ పొందిందని పేర్కొన్నారు.

చిత్ర యూనిట్ మొత్తం ఆదివారం నాడు ఉండవల్లి సెంటర్లోని రామకృష్ణ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తామని తెలియజేశారు.

త్వరలో తన ప్రధాన పాత్రలో నటించిన నటన సూత్రధారి తోపాటు మరికొన్ని సినిమాలు వరుసగా వస్తున్నాయని పేర్కొన్నారు. రేపు రిలీజ్ అవుతున్న రిచిగాడి పెళ్లి ఇప్పటికే హైదరాబాద్లో ప్రీమియర్ షోలో మంచి టాక్ సొంతం చేసుకొందని అన్నారు. మంచి సినిమాలు ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Comments