రాష్ట్రం లోని ప్రతి మహిళను సొంత అక్క చెల్లెళ్ళుగా భావించి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పధకంలో మహిళలను భాగస్వాములను చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి


నెల్లూరు  మార్చి 28 (ప్రజా అమరావతి);


రాష్ట్రం లోని ప్రతి మహిళను సొంత అక్క చెల్లెళ్ళుగా భావించి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పధకంలో మహిళలను భాగస్వాములను చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి


గారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు  శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.


మంగళవారం ఉదయం పొదలకూరు మండల కేంద్రంలో వై ఎస్ ఆర్ ఆసరా 3 వ విడత నిధులు పంపిణీ కార్యక్రమంలో మంత్రి కాకాణి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తోలుత డి ఆర్ డి ఎ పిడి సాంబశివ రెడ్డి కార్యక్రమ ముఖ్యోద్దేశం గురించి వివరిస్తూ స్వయం సహాయక సభ్యులు బ్యాంకు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మహిళలకు అండగా నిలుస్తూ ప్రభుత్వమే చెల్లించడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన జీవనోపాధి కల్పన దిశగా మహిళలు ముందంజలో ఉండాలన్నారు.


ఈ సందర్బంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలను సొంత అక్కాచెల్లెళ్ళుగా భావిస్తూ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 

స్వయం సహాయక సభ్యులకు ఆసరా 3వ విడత నిధులను విడుదల చేస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లాలోని 34,440 గ్రూపులకు 826 కోట్లు మంజూరు చేసామన్నారు. అందులో సర్వేపల్లి నియోజకవర్గంనకు సంబంధించి 4056 గ్రూపులకు 91 కోట్ల 83 లక్షలు నిధులు మంజూరు కాగా, పొదలకూరు మండలం నకు సంబంధించి 1039 గ్రూపులకు 25 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఒక పధకానికి నిధులు కేటాయించడం గతంలో ఎన్నడూ లేదన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే రెండు విడతలు మంజూరు చేసి ఇప్పుడు మూడో విడత నిధులు మంజూరు చేశారన్నారు. మహిళలు కుటుంబాన్ని చక్కదిద్దటంలో ముఖ్య పాత్ర పోషిస్తారని, అటువంటి మహిళలకు ఆసరాగా ఉంటూ సహాయం అందచేస్తే అద్భుతాలు చేస్తారనే ఉద్దేశంతోనే ప్రతి పధకాన్ని మహిళల పేరుతోనే ముఖ్యమంత్రి అమలు చేస్తారన్నారు. మహిళల గురించి ఇంతలా ఆలోచించే ముఖ్యమంత్రి దేశంలోనే లేరని, వారిని ఆర్ధిక స్వాలంబన దిశ గా నడిపించుటకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని విభిన్న తరహా జీవనోపాధులు ఎంచుకుని ఆర్ధిక సుస్థిరత సాధించాలన్నారు. అదేవిధంగా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను విరివిగా ప్రోత్సహిస్తున్నామని, వీటి ద్వారా వారు జీవితం లో నిలదొక్కుకోవడమే కాకుండా మరింత మందికి ఉపాధి కల్పిస్తారన్నారు. 


అంతకుముందు మంత్రి కాకాణి స్వయం సహాయక గ్రూపులు ఉపాధి పొందుతున్న వివిధ రకాల స్థాళ్ళను పరిశీలించారు. పొదలకూరు మండలం నకు సంబంధించిన వై ఎస్ ఆర్ ఆసరా 3 వ విడత మొత్తం 8 కోట్ల 41 లక్షల 26 వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల చెక్కును మహిళలకు అందచేశారు.


ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్టెమ్మ, గ్రామ ప్రముఖులు గోపాల్ రెడ్డి, రమణారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి సుధాకర్ రాజు, వందలాది మహిళలు పాల్గొన్నారు.



Comments