శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి

 

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):

            దేవస్థానం నందు ఈరోజు మీడియా మిత్రుల సమావేశం మహామండపం 6 వ అంతస్తు నందు నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ కర్నాటి రాంబాబు  ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ళ భ్రమరాంబ , ట్రస్ట్ బోర్డు సభ్యులు బుద్దా రాంబాబు, చింకా శ్రీనివాస్, కేసరి నాగమణి, బచ్చు మాధవీ కృష్ణ, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కే.వి.ఎస్ కోటేశ్వర రావు, ఎల్.రమాదేవి   పాల్గొన్నారు.

   

            ఈ సమావేశం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ కర్నాటి రాంబాబు  మాట్లాడుతూ, 2020 దసరా ఉత్సవములలో అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించుటకు విచ్చేసిన సమయములో  ముఖ్యమంత్రివర్యులు దేవస్థాన అభివృద్ధి పనులు చేపట్టుటకై రూ.70 కోట్లు మంజూరు చేసియున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తరుపున ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన నిధులలో 30కోట్ల అంచనాతో దాదాపు 2000మంది కెపాసిటీ తో అన్నదాన భవనము నకు టెండర్లు పిలుచు దశకు తీసుకురావడం జరిగినదని, 27 కోట్లతో ప్రసాదము పోటు భవనము కూడా త్వరగా టెండరు ప్రక్రియ మొదలుపెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా ఆలయ కార్యనిర్వహణాధికారి  మరియు అధికారుల కృషికి ఈ పాలకమండలి వారు సహకారం అందిస్తూ అభివృద్ధి పనులు త్వరితగతిన ముందుకు తీసుకెళ్ళుటకు గానూ చర్యలు తీసుకొనుట జరుగుచున్నదని తెలిపారు. పాలక మండలి ఏర్పాటైన 30-40 రోజులలో అభివృద్ధికి వేగముగా అడుగులు పడడం జరిగినదని, భక్తుల సౌకర్యార్థం పాలకమండలి సమావేశం నందు తీర్మానం చేసిన కొన్ని పనులు ప్రారంభించడం జరిగినదని మరికొన్ని అంశములు దేవాదాయ కమీషనరు వారి కార్యాలయము నకు అనుమతుల కొరకు పంపి అది కూడా ప్రాసెస్ లో ఉందని ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కర్నాటి రాంబాబు  తెలిపారు. పాలకమండలి ఏర్పాటైనప్పటి నుండి ఎప్పుడూ భక్తులతో ఉండి, భక్తుల మౌలిక సదుపాయాలకు అవసరమగు నిర్ణయాలు తీర్మానములు ఆలయ కార్యనిర్వహణాధికారి తో చర్చించి బోర్డులో తీర్మానించి ముందుకు వెళ్ళడం జరుగుతుందని తెలిపారు. అలాగే శివాలయం నకు అయిదున్నర కోట్లు కేటాయింపబడటం జరిగినదని, మరియు రూ.13.00 కోట్లుతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ త్వరలో టెండరు ప్రక్రియకు వెళ్లనుందని, రానున్న రోజులలో భక్తుల సౌకర్యార్థం, మాస్టర్ ప్లాన్ ను కూడా పరిశీలించి, భవిష్యత్తులో మాస్టర్ ప్లాన్ ను మార్చకుండా అన్ని విధములా మాస్టర్ ప్లాన్ ను సరిచేసి,  రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ తో కూడామాట్లాడి భవిష్యత్తులో వచ్చే అధికారులు గానీ, పాలకమండలి గానీ మాస్టర్ ప్లాన్ ను మార్చకుండా ఫిక్స్డ్ గా ఉండుటకు GO ను కూడా తీసుకురావటానికి చర్యలు తీసుకుంటామని  తెలిపారు. భక్తులు ఎవరైనా వారి సలహాలు, సూచనలు అందజేసినచో వాటిని కూడా పరిగణించి, study చేసి అమలు పరుస్తామని తెలిపారు. కేశఖండన శాల యందు భక్తుల ఫిర్యాదులు అధ్యాయమునకు త్రిసభ్య కమిటీఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం సమావేశమునకు విచ్చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదములు తెలిపారు. ఏంతో ప్రసిద్ది గాంచిన శ్రీ అమ్మవారి ఆలయమునకు సంబంధించి పొరబాట్లు, సమస్యలు ఏవైనా ఉంటే ముందుగా పరిష్కారం కొరకు తమ దృష్టికి తీసుకువచ్చి, తదనంతరం ముందుకు వెళ్ళాలని, ఆలయ అభివృద్దికి, సేవకు తమతో పాటు సహకారం అందించాలని కోరారు.

Comments