రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
వర్ష సూచన- తీసుకోవలసిన జాగ్రత్తలు:
జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు
జిల్లాలో సాగులో ఉన్న వరి పంట ప్రస్తుతం గింజ పలుపోసుకునే దశ నుండి గింజ గట్టి పడే దశ వరకు ఉంది కావున రైతాంగం, ముఖ్యంగా కోతలు జరుగుతున్న వరి రకమైన RNR 15048 బయట మార్కెట్లో అధిక రేటు ,అంటే 75 కిలోల బస్తా 1650 రూపాయలు పలుకుతుంది.
కావున పంట కోసిన వెంటనే వర్షానికి తడిసిపోకుండా , సురక్షిత ప్రాంతాలకు తరలించి జాగ్రత్తలు తీసుకోవాలి.
కోత కోయుటకు తయారు గా ఉన్న పంటను వర్షాలు తగ్గేవరకు కోతలను ఆపాలి.
ముఖ్యంగా ఈ రకం రాజమండ్రి, రాజానగరం ప్రాంతాల్లో 32130 Ha లో ఈ రకం సాగు చేయటం జరుగుతుంది. ఇప్పటి వరకు రాజమండ్రి మండలంలో222 Ha, రాజానగరం మండలమ్ లో45 Ha కోతలు జరిగినవి.
మిగతా వరి రకాలలో ముఖ్యముగా MTU 1121 రకం ఇంకా కోతలకు సమయం ఉంది కావున రైతులు ఎటువంటి నిరుత్సాహ పడవలసిన పని లేదు. ఒకవేళ అధికంగా వర్షాలు పడినట్లయితే డ్రైనేజ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని పొలంలో అధిక నీటిని డ్రైనేజ్ కాలు ద్వారా బయటికి, తీసుకున్నట్లయితే వరి పంటకు ఎటువంటి ప్రమాదం ఉండదు.
కావున రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా కోతకు సిద్దంగా ఉన్న పంట కోత పనులు వర్షాలు తగ్గకా పనులు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
addComments
Post a Comment