నిబద్ధత కలిగిన నిస్వార్ధ రాజకీయ నేత బచ్చుల.

 *- నిబద్ధత కలిగిన నిస్వార్ధ రాజకీయ నేత బచ్చుల*


 

 *- గుడ్లవల్లేరు టీడీపీ కార్యాలయంలో ఘన నివాళి*


 గుడ్లవల్లేరు /గుడివాడ, మార్చి 4 (ప్రజా అమరావతి): నేటి రాజకీయాల్లో నిబద్ధత కలిగిన  నిస్వార్థ రాజకీయ నేత బచ్చుల అర్జునుడు అని తెలుగుదేశం పార్టీ గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి అన్నారు. శనివారం సాయంత్రం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండల టిడిపి కార్యాలయంలో టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా బచ్చుల చిత్రపటానికి టిడిపి గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం జరిగిన సభలో కొసరాజు బాపయ్య చౌదరి మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎంతో అంకితభావంతో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పని చేశారన్నారు. మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్సీ వంటి ఎన్నో పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారని కొనియాడారు. ముఖ్యంగా బలహీన వర్గాలకు నాయకుడిగా తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించారని అన్నారు. బచ్చుల మరణంతో తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడిని కోల్పోయిందని, ఆయన లేని లోటు పార్టీకి తీరనిదని అభిప్రాయపడ్డారు. బచ్చుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. బచ్చుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు కొసరాజు బాపయ్య చౌదరి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో  బీసీ నాయకులు పెద్దిబోయిన లక్ష్మి, నరసింహరాజు, గొరిపర్తి  రామారావు, బొర్రా నాగేశ్వరావు, కాగిత నరేంద్ర, పందిసుబ్రహ్మణ్యం, పామర్తి  కన్నె భాస్కరావు, సీనియర్ నేత కొడాలి రామరాజు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments