రెండో వన్డేలో ఆసీస్ IO వికెట్ల తేడాతో విజయం

 విశాఖ (ప్రజా అమరావతి): టీమ్ ఇండియాతో జరిగిన రెండో వన్డేలో ఆసీస్ IO వికెట్ల తేడాతో విజయం


సాధించింది. ఆసీస్ ఓపెనర్లు ఇద్దరూ అర్ధశతకాలు నమోదు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 26 ఓవర్లలో 117 పరుగులు చేసి ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ॥ ఓవర్లలోనే 121 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకున్నారు. ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (5|*), మిచెల్ మార్ష్ (66 *) కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో మూడు వన్డేల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నారు. మూడో వన్డే చెన్నైలో వేదికగా జరగనుంది.

Comments