జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని సేకరించి డివిజనులకు పంపిణీ చేశామo



నెల్లూరు, మార్చి 9 (ప్రజా అమరావతి):


జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని సేకరించి డివిజనులకు పంపిణీ చేశామ


ని  జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి తెలిపారు.



గురువారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం వెలగపూడి నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి( సి.ఈ. ఓ) శ్రీ ముఖేష్ కుమార్ మీనా పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.


ఈ సందర్భంగా ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని సమయం ఎక్కువ లేనందున అందుకోసం కావలసిన పేపర్ సీల్లు, స్కెచ్ పెన్నులు, ఇండేలిబుల్ సిరా సీసాలు తదితర ఎన్నికల పోలింగ్ సామాగ్రిని, ప్యాకింగ్ సామాగ్రిని వెంటనే సమకూర్చుకోవాలన్నారు.  అవసరమైన మేరకు బ్యాలెట్ పెట్టాలను సిద్ధం చేసుకోవాలని, పోలింగ్ సామాగ్రి పంపిణీ, స్వీకరణ కోసం అవసరమైన కేంద్రాలను   ఏర్పాటుచేయాలన్నారు. బ్యాలెట్ పెట్టెలు, బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా  భద్రపరచాలన్నారు. పోలింగ్ సిబ్బందిని, సామాగ్రిని తరలించేందుకు అన్ని రవాణా ఏర్పాట్లు చేయాలన్నారు

 అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.  ఓటర్ స్లిప్పులను పూర్తిగా పంపిణీ చేయాలన్నారు.  పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్కు 48 గంటల ముందు మద్యం విక్రయాలు జరగకుండా గట్టి నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.

 బ్యాలెట్ పత్రాలు అవసరం మేరకు సరైన స్థితిలో ఉన్నాయా లేదా కొరత ఉన్నాయా లేదా ముందుగా పరిశీలించి లెక్క ప్రకారం సరిచూసుకోవాలన్నారు. పోలింగ్ పిఓలు ఏపీవోలు, వెబ్ కాస్టింగ్ సిబ్బందికి  పోలింగ్ నిర్వహణపై శిక్షణా తరగతులు పూర్తి చేయాలన్నారు. 


అనంతరం జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ప్యాకింగ్, పంపిణీ సామాగ్రి పూర్తిగా సేకరించామన్నారు.

భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం బ్యాలెట్ పెట్టెలకు నంబర్లు వేసి డివిజన్లకు పంపిణీ చేశామన్నారు.

పోలింగ్ నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పత్రాలు  అందాయని వాటిని  పోలింగ్ కేంద్రాల వారీగా వేరుపరచి 4 డివిజన్లకు పంపించామన్నారు.


 డివిజన్ స్థాయిల్లో ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ గదులను ఏర్పాటు చేసి అందులో బ్యాలెట్ పెట్టెలు బ్యాలెట్ పత్రాలు  భద్రపరిచామన్నారు.


జిల్లాలోని నాలుగు డివిజనల్ కేంద్రాలలో డివిజనల్ అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ సామాగ్రి పంపిణీకి, తదుపరి స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.


పోలింగ్ నిర్వహణకు నియమించబడిన పిఓలు, ఏపీవోలు, సూక్ష్మ పరిశీలకులు, వెబ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ తరగతులు పూర్తి చేసామన్నారు.


పోలింగ్ సామాగ్రి, సిబ్బందిని తరలించేందుకు వీలుగా 24 బస్సులను, 4 డీజిటి వాహనాలను సిద్ధం చేశామన్నారు.


జిల్లాలోని 169 పోలింగ్ కేంద్రాల్లోనూ

పోలింగ్ నిర్వహణకు అవసరమైన వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.


ఓటర్ స్లిప్పులు పంపిణీ కార్యక్రమం పూర్తి చేశామని అందుకు సంబంధించిన నివేదిక సాయంత్రం అందజేస్తామన్నారు.


పోలింగ్ కు 48 గంటల ముందు అనగా 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి 13వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం  విక్రయాలు నిలుపుదల చేస్తూ డ్రైడేగా పాటించాలని ప్రకటన జారీ చేస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు అయ్యేలా చూస్తామన్నారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి  సంయుక్త కలెక్టర్ శ్రీ రోనంకి కూర్మనాద్,  ఏఆర్ఓ- డీఆర్వో శ్రీమతి వెంకటనారాయణమ్మ, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీమతి ఎస్ఎస్ శోభిక, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీవోలు శ్రీ ఏ మలోల, శ్రీ శీనా నాయక్ శ్రీమతి కరుణకుమారి, నోడల్ అధికారి శ్రీ  ప్రేమ్ కుమార్ తదితర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.




Comments