నెల్లూరు మార్చి 30 (ప్రజా అమరావతి);
గ్రామాల సమగ్ర అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల సమ్మిళిత సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వo పనిచేస్తుంద
ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు.
గురువారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం టి పి గూడూరు మండలం కొత్త కోడూరు పంచాయతీ పరిధిలో మూడవ రోజు గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పి డి కండ్రిక, గమళ్లపాలెం లలో పర్యటించిన మంత్రి కాకాణికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.
పి డి కండ్రిక గ్రామంలో మంచినీటి ఆర్ ఓ ప్లాంట్ ను ప్రారంభించిన అనంతరం గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్న వైనం తెలుసుకుంటూ ప్రజలతో మమేకమయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, అర్హత కలిగి సాంకేతిక కారణాలతో అందకపోయిన వారికి అందించడమే లక్ష్యంగా గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్టుగా తెలిపారు. ప్రతి గ్రామంలో మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్లు వేసామన్నారు. గ్రామాలకు అవసరమైన త్రాగునీరు, సాగునీరు అందించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. పి డి కండ్రిక గ్రామంలో పేద గిరిజన మహిళలు ఎదురేగి ఇచ్చిన హామీలు నెరవేర్చారని సంతోషం తో చెప్పినప్పుడు ఆత్మసంతృప్తి కలిగిందన్నారు. అన్ని గ్రామాల్లో గతానికి ఇప్పటికి స్పష్టమైన తేడా కనిపిస్తుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరను మించి ఆదాయం సమకూరుతుందన్నారు. అందుచేతనే గిట్టుబాటు ధర కోసం పోరాటాలు జరిగిన సందర్భాలు లేవన్నారు.
ఈ కార్యక్రమంలో యం పి డి ఓ హేమలత, వివిధ శాఖల మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment