104 వాహనాన్ని ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులు*



*104 వాహనాన్ని ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులు* 


రొంపిచెర్ల, ఏప్రిల్ 6. (ప్రజా అమరావతి); రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైద్య సదుపాయాన్ని అందించడమే లక్ష్యం గా గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు 104 వాహనాలను ప్రవేశ పెట్టడం జరిగిందని గౌ. రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు



గురువారం  రొంపి చెర్ల  మండలంలో నూతన 104 వాహనాన్ని మంత్రివర్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జెడ్ పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, టిటిడి బోర్డు మెంబెర్ పోకల అశోక్ కుమార్, ఆరోగ్యశ్రీ కొ ఆర్డినేటర్ డా. ఎన్.రాజశేఖర్ రెడ్డి, 104 వాహనాల జిల్లా మేనేజర్ ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్నంగా ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని రూపొందించి నేడు ప్రారంభించారని, ఇందులో భాగంగా జిల్లాలో 464 వై.యస్.ఆర్ హెల్త్ క్లినిక్ ల నందు ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రతి 2 వేళా జనాభా కు ఒక విలేజ్ క్లినిక్ కేంద్రంగా ఫ్యామిలీ ఫిజీషియన్ ను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రతి మండలానికి రెండు పి హెచ్ సి లు, ప్రతి పి హెచ్ సి లో ఇద్దరు వైద్యులు ఉండేలా బృహత్తర వైద్య వ్యవస్థను గ్రామ స్థాయిలో తీసుకొచ్చిందని, ఒక వైద్యులు పి హెచ్ సి లో అందుబాటులో ఉంటారని, మరొకరు 104 వాహనం ద్వార్ఫా ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. 104 ద్వారా ఓ పి సేవలతో పాటు గర్భిణీలు, నవజాత శిశువులు, బాలింతలు, రక్తహీనతతో పాటు వివిధ సమస్యలున్న రోగులకు అవసరమైన 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులను ఉచితంగా అందించబడుతుందని తెలిపారు. నెలలో రెండు సార్లు వైద్యులు ఒక్కో గ్రామాన్ని సందర్శించి వైద్య సేవలను అందిస్తారని, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాల లోని విద్యార్థులను పరీక్షించి వారికి అవసరమైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. మంచం మీద నుండి లేవలేని స్థితిలోని రోగులకు ఫ్యామిలీ డాక్టర్ విధానంతో వైద్య సదుపాయం అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను పరీక్షించి వారికి అవసరమైన వైద్య సేవలను అందిస్తారని తెలిపారు.

Comments