‘‘రుషికొండ పర్యాటక ప్రాజెక్ట్ “ పై మీడియా లో 13–04–23వ తేదీన ప్రచురితమైన ప్రతికూలమైన కధనాలకు సంబంధించి రిజాయిండర్.
అమరావతి (ప్రజా అమరావతి);
‘‘రుషికొండ పర్యాటక ప్రాజెక్ట్ “ పై మీడియా లో 13.04.2023న ప్రచురితమైన కథనం పూర్తిగా సత్యదూరమైనది. రుషికొండ నిర్మాణాల్లో ఎలాంటి ఉల్లంఘనలు లేవు. అనుమతించిన దానికన్నా తక్కువ విస్తీర్ణంలోనే నిర్మాణాలు చేపడుతున్నాం. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుండి సభ్యులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో
1. పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ
2. నేషనల్ ఇన్సి్టట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ,
3. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్,
4. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్,
5. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు సభ్యులుగా ఉంటారు.
పై కమిటీ తమ విచారణ నివేదికను ఈ నెల 12న గౌరవ హైకోర్టుకు సమర్పించింది. అయితే నివేదికలోని వాస్తవాలను విరుద్ధంగా ఆంధ్రజ్యోతి పత్రిక వారు తమ కథనంలో ప్రచురించారు.
రుషికొండలో నిర్మాణ కార్యకలాపాల కోసం 20 ఎకరాల భూమిని ఏపీటీడీసీ వినియోగించుకుందని పిటిషనర్ల ఆరోపించారు. దీనిపై ఇప్పటికే ఏపీటీడీసీ తన కౌంటర్ అఫిడవిట్‌ను హైకోర్టు ముందు దాఖలు చేసింది. 9.88 ఎకరాల భూమిని మాత్రమే నిర్మాణానికి వినియోగించినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ భూమిని చేర్చి కొండవాలు నిలబడడానికి వీలుగా 3.86 ఎకరాల స్లోప్ ఏరియాను తీసుకోవడం జరిగింది. మరో 3.30 ఎకరాలను తవ్విన మట్టిన డంపింగ్ కోసం వినియోగించారు. ఈ క్రమంలో జాయింట్ కమిటీ తమ నివేదికలో ప్రాజెక్టు ఏరియా 9.88 ఎకరాలు, స్లోప్ ఏరియా 3.86 ఎకరాలుగా నిర్ధారించింది. డంపింగ్ కోసం 3.30 ఎకరాలను వినియోగించినట్టుగా ఏపీటీడీసీ పేర్కొనగా, కమిటీ మాత్రం 4.225 ఎకరాలు వినియోగించినట్టు తన నివేదికలో పేర్కొంది. రుషికొండకు దక్షిణం వైపున ఉన్న సీఆర్‌జెడ్–2 ప్రాంతంలో మట్టిని డంప్ చేస్తున్నారని జాయింట్ కమిటీ గుర్తించింది. తవ్విన మట్టిని తాత్కాలిక నిల్వ ప్రయోజనాల కోసం అందుబాటులో ఉన్న బహిరంగ ప్రదేశంలో డంప్ చేయడం జరిగింది. ఈ మట్టిని ప్రాజెక్ట్ సైట్‌లోని ల్యాండ్‌స్కేపింగ్, హార్డ్‌స్కేపింగ్ పనులకు ఉపయోగించబడుతుంది. ఒక వేళ ఇంకా తవ్విన మట్టి మిగిలినట్టయితే నిర్మాణ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత ఆ మట్టిని సైట్ నుండి పూర్తిగా వేరే ప్రాంతానికి తొలగించబడుతుంది. కాబట్టి పర్యావరణపరిరక్షణ దృష్ఠ్యా∙ఇది ఏ మాత్రం అభ్యంతరకరం కాదు. ఈ ప్రాజెక్టు కోసం సీఆర్‌జెడ్ మంజూరు చేసిన అనుమతుల మేరకు తవ్విన మట్టిని తాత్కాలికంగా నిల్వ చేసి ప్రాజెక్టు పూర్తయిన పిదప ల్యాండ్‌స్కేపింగ్ పనుల కోసం వినియోగించాలని నిర్ధేశించడమైంది. భవన నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఈ ల్యాండ్ స్కేపింగ్, హార్డ్ స్కేపింగ్ పనులు చేపట్టడం జరుగుతుందని తెలియ జేస్తున్నాం.
బిల్ట్–అప్ ఏరియాలకు సంబంధించి, 2.71 ఎకరాల్లో మొత్తం 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 7 బ్లాకుల నిర్మాణానికి పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఏపీటీడీసీ అనుమతి తీసుకుంది. అయితే ఏపీటీడీపీ నిర్మాణాన్ని 4 బ్లాకులకు పరిమితం చేసుకుని 1.84 ఎకరాల విస్తీర్ణంలోని 13,542 చదరపు మీటర్ల పరిధిలో నిర్మాణం చేపట్టింది, కానీ కమిటీ తన నివేదికలో పొరపాటున 15,384 చదరపు మీటర్లుగా పేర్కొన్నారు. 4 బ్లాకుల నిర్మాణ విస్తీర్ణ ప్రాంతాన్ని కూడికలో దొర్లిన తప్పుగా గుర్తించడం జరిగింది. 13,792.80 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 4 బ్లాకుల నిర్మాణానికి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి అనుమతి పొందింది. వాస్తవ నిర్మాణ విస్తీర్ణం 13,542 చ.మీ., ఈ ఆమోదించబడిన విస్తీర్ణం పరిధిలోనే ఉంది. ఈ విధంగా ఏపీటీడీపీ చేపట్టిన భవన నిర్మాణాలకు సీఆర్‌జెడ్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అనునతులకు లోబడే ఉన్నాయి. కావున, ప్రజలకు వాస్తవాలపై స్పష్టమైన అవగాహన కొరకు వార్తాపత్రికలో పై వాస్తవాలను ప్రచురించవలసిందిగా కోరుతున్నాము.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు ఏపీటీడీసీ అన్ని చర్యలు తీసుకుంటోంది. MOEF అందించిన CRZ క్లియరెన్స్ ప్రకారం, ల్యాండ్‌స్కేపింగ్ మరియు హార్డ్ స్కేపింగ్ పనులు 9.88 ఎకరాలు ప్రాజెక్ట్ సైట్ లో 4.70 ఎకరాలు విస్తీర్ణం లో చేయాలి. పైన పేర్కొన్న విధంగా బ్లాక్‌ల సంఖ్య మరియు నిర్మాణ విస్తీర్ణం తగ్గింపుతో, ల్యాండ్ స్కేపింగ్ విస్తీర్ణం ఆమోదించబడిన 4.70 ఎకరాలు విస్తీర్ణం కంటే ఎక్కువగా ఉంటుంది. APTDC ఇప్పటివరకు 16350 స్థానిక జాతుల మొక్కలు మరియు 24,120 కంచె మరియు పొదల మొక్కలు మరియు గ్రౌండ్ కవర్ కోసం 4047 తీగ మొక్కలను నాటించడ మయినది. తద్వారా ప్రాజెక్ట్ సైట్ యొక్క వాతావరణాన్ని గ్రీన్ కవర్‌తో మెరుగుపరుస్తుంది. అలాగే రుషికొండ కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటడంతోపాటు ఆ ప్రాంతంలో వృక్షసంపదను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు. అందువల్ల, పైన పేర్కొన్న వాస్తవాలను హైలైట్ చేస్తూ, రుషికొండ ప్రాజెక్ట్ మరియు పరిసర ప్రాంతాలలో వృక్షసంపద మరియు పచ్చదనాన్ని మెరుగుపరచడానికి APTDC చేసిన ప్రయత్నాలను కూడా హైలైట్ చేస్తూ ఒక రిజాయిండర్‌ను ప్రచురించవలసిందిగా అభ్యర్ధించడ మయినది.
addComments
Post a Comment