ఏప్రిల్ 14 - ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 



ఏప్రిల్ 14 - ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు



రాష్ట్ర స్థాయి సచివాలయ వాలంటీర్ల కు పురస్కారాలు కార్యక్రమం 


.. కలెక్టర్ మాధవీలత 



ఏప్రిల్ 14 సచివాలయ గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు సేవా పురస్కార అవార్డుల రాష్ట్ర స్థాయి కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వివిధ  ప్రాంతాలని చూడడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత లు పేర్కొన్నారు.


శనివారం ఉదయం  కొవ్వూరు పట్టణంలో  జేసీ, ఆర్ ఎం సి మునిసిపల్ కమిషనర్ లతో కలిసి కలెక్టర్ పర్యటించారు. కలెక్టర్ మాధవీలత ఈ సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ, ఏప్రిల్ 14 న భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ పుట్టిన రోజును పురస్కరించుకుని సచివాలయ సిబ్బందికి అవార్డ్ లు, నగదు పురస్కారం రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి తూర్పు గోదావరీ జిల్లా వేదిక కానుందని తెలిపారు. 


 ఈ పర్యటన కోసం  బహిరంగ సభ, హెలిప్యాడ్, వాహనాలు పార్కింగ్, తదితర క్షేత్ర స్థాయి ఏర్పాట్ల ను ప్రత్యక్షంగా పరిశీలించడం కోసం చర్యల్లో భాగంగా పర్యటన నిర్వహించామని పేర్కొన్నారు. నిన్నటి రోజున హోం మంత్రి తో కలిసి  కొవ్వూరు లోని యువరాజ్ ఫంక్షన్ హాలు సమీపంలో దేచర్ల రిలయన్స్ సైట్, తహశీల్దార్ కార్యాలయం సమీపంలో  ప్రాంతాలను, గోష్పాద రేవు సమీపంలో వున్న ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. 


కలెక్టర్ వెంట  జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఆర్డీవో ఎస్. మల్లి బాబు, ఆర్ అండ్ బి ఈఈ ఐ. దేవేంద్ర రాజు, మునిసిపల్ కమీషనర్ బి. శ్రీకాంత్, కొవ్వూరు తాహిశీల్దార్ బి. నాగరాజు నాయక్, వివిధ శాఖల అధికారులు , స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.



Comments