తిరుపతి, 16 ఏప్రిల్ (ప్రజా అమరావతి);
ఏప్రిల్ 20న పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ పోస్టుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ
తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ ( చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి ) లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన రెండు సంవత్సరాల కాలపరిమితితో పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ పోస్టును భర్తీ చేసేందుకు ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఆసుపత్రిలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరగనుంది.
అర్హులైన అభ్యర్థులు తగిన సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిందిగా కోరడమైనది. ఇతర వివరాల కోసం టీటీడీ వెబ్ సైట్ ను గానీ, ఆసుపత్రి వెబ్ సైట్ ను గానీ సంప్రదించగలరు.
addComments
Post a Comment