నేడు (ఈనెల 26న) అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలలో జగనన్న వసతి దీవెన జమ: జిల్లా కలెక్టర్
పుట్టపర్తి, ఏప్రిల్ 25 (ప్రజా అమరావతి): ఈ నెల 26న బుధవారం జగనన్న వసతి దీవెన 2022 -23 విద్యా సంవత్సరానికి తొలివిడత అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల ఖాతాలకు రాష్ట్రవ్యాప్తంగా జమ చేసే కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా నార్పల నుండి కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమం వీక్షించే విధంగా జిల్లా కలెక్టరేట్ లో స్పందన వీడియో కాన్ఫరెన్స్ హాలు నందుఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి కార్యక్రమం అనంతరం జిల్లాలో అర్హత కలిగిన 31968మంది విద్యార్థుల తల్లులకు రూ. 33.68 కోట్ల మెగా చెక్కును లబ్ధిదారులకు అందించనున్నామని, ప్రజా ప్రతినిధులు అధికారులు లబ్ధిదారులు హాజరుకానున్నారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు .
addComments
Post a Comment