పెనుమూరు మండల కేంద్రంలో రూ. 2 కోట్ల అంచనా వ్యయం తో మంజూరైన టిటిడి కళ్యాణ మండపానికి భూమి పూజ చేసిన డిప్యూటీ సీఎం, టిటిడి చైర్మన్..



*పెనుమూరు మండల కేంద్రంలో రూ. 2 కోట్ల అంచనా వ్యయం తో మంజూరైన టిటిడి కళ్యాణ మండపానికి భూమి పూజ  చేసిన డిప్యూటీ సీఎం, టిటిడి చైర్మన్..*


 

పెనుమూరు, ఏప్రిల్ 27 (ప్రజా అమరావతి);


రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దేవాలయాల అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం తో కృషి చేస్తున్నార ని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి పేర్కొన్నారు.


గురువారం జీడీ నెల్లూరు నియోజక వర్గ పరిధి లో పెనుమూరు మండల కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి,టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డితో కలసి తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపము నకు భూమి పూజ చేశారు.


          ఈ కార్యక్రమానికి టిటిడి బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్,రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, చిత్తూరు ఆర్డిఓ రేణుకా, ఆరు మండలాల జడ్పీటీసీ లు, ఎంపిపి లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


ఈ కార్యక్రమం మొదటగా జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమయ్యింది.


          *ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి మాట్లాడు తూ..* తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం తో దేవాలయాల అభివృద్ధికి ముఖ్య మంత్రికృషిచేస్తున్నారనన్నారు.గంగాధర్ నెల్లూరు నియోజక వర్గ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఈ నియోజకవర్గంలో రెండు 50 పడకల ఆసుపత్రినిమంజూరు చేయడంతో పాటు కలిగిరి కొండ, వేణుగోపాల స్వామి ఆలయాల అభివృద్ధి కి కృషి చేశారన్నారు. టిటిడి కళ్యాణ మండపం నిర్మాణము నకు 20 శాతం మ్యాచింగ్ గ్రాండ్ కట్టవలసి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పెద్ద మనసుతో మ్యాచింగ్ గ్రాంట్ కట్టే పని లేకుండా మంజూరు చేశారని, హిందూ ధర్మ ప్రచారంను టిటిడి యంత్రాంగం విస్తృతంగా చేస్తున్న దని, అందులో భాగంగా ఆలయాల నిర్మాణానికి పూర్తి సహకరిస్తున్నారన్నారని తెలిపారు.


         టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరుగుతోందని తెలిపారు. రెండు 50 పడకలఆసుపత్రులు,డిగ్రీ కాలేజీ, మూడు ఇరిగేషన్ ప్రాజెక్టుల ను ముఖ్యమంత్రి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. డిప్యూటీ సీఎం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా పేదవారికి మంచి చేయాలనే ఉద్దేశంతో నిరంతరం పనిచేస్తున్నారని అభినందించారు. నియోజకవర్గంలో ఎకరా 12 సెంట్లలలో రూ.2 కోట్లతో కళ్యాణ మండపం నిర్మాణమునకు భూమి పూజ చేయడం సంతోషమని తెలిపారు. ఈ కళ్యాణ మండపం నిర్మాణానికి ముందుగా 20 శాతం మ్యాచింగ్ గ్రాంట్ అనగా 40 లక్షలు చెల్లించాల్సి ఉండగా డిప్యూటీ సీఎం అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి గారి అనుమతితో టీటీడీ బోర్డులో ఆమోదం తెలిపి కళ్యాణ మండపం మంజూరు చేయడం జరిగిందని, పేదలకు మంచి చేసే సదుద్దేశంతో డిప్యూటీ సీఎం చేసిన అభ్యర్థనను ముఖ్యమంత్రి ఆమోదించారని తెలిపారు. దళితులు, గిరిజనులు ఉన్న ప్రాంతాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలను నిర్మించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టామని తద్వారా స్వామి వారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని, ఇందులో 1000 ఆలయాలు నిర్మాణం జరుగుతున్నదని దీనితో పాటు మరో 2000 ఆలయాలు మంజూరు చేయడం జరిగిందని, జీడి నెల్లూరు నియోజకవర్గానికి 75 ఆలయాలు మంజూరు చేశామన్నారు.


              టిటిడి పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ* రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పూర్తి పారదర్శకంగా సంక్షేమ పథకాలను అర్హులకు అందజేస్తున్నారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి ముoగిటికే ప్రభుత్వ సేవలను తీసుకొని వచ్చారన్నారు. హిందూ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కృషి చేస్తుందని, స్వామి వారి దర్శనం నిమిత్తం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం, హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలను శ్రీవాణి ట్రస్టు నిధులతో నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు.


          ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ* రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమానికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. గత 40 సంవత్సరాలుగా జీడి నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధికి డిప్యూటీ సీఎం కృషి చేస్తున్నారని గ్రామీణ ప్రాంతాలలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పి దాదాపు 4500 మందికి ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు.


          ఈ సందర్భంగా శివ ప్రకాష్ రాజు టీటీడీకి పది లక్షల రూపాయల విరాళంనకు సంబంధించిన చెక్కును చైర్మన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అతిధుల చేతుల మీదుగా విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ తరపున పదిమందికి మూడు చక్రాల మోటార్ సైకిల్ ను అందజేశారు. ప్రకృతి వ్యవసాయం నకు సంబంధించి ఖరీఫ్ సీజన్ యాక్షన్ ప్లాన్ కు సంబంధించిన పోస్టర్స్ ను డిప్యూటీ సీఎం టిటిడి చైర్మన్ తదితరులు ఆవిష్కరించారు.



Comments