భూమి పూజ అనంతరం 30 నెలల వ్యవధిలో మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం పూర్తి !!-- కలెక్టర్ రాజాబాబు


 

 మచిలీపట్నం : ఏప్రిల్ 21 (ప్రజా అమరావతి);


*భూమి పూజ అనంతరం 30 నెలల వ్యవధిలో మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం పూర్తి !!* 


    *-- కలెక్టర్ రాజాబాబు


*



వచ్చే నెలలో ముఖ్యమంత్రి మచిలీపట్నం పోర్టు పనులకు భూమి పూజ నిర్వహించిన అనంతరం 30 నెలల వ్యవధిలో పోర్ట్ నిర్మాణం పూర్తవుతుందని కృష్ణాజిల్లా  కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు.


శుక్రవారం సాయంత్రం కలెక్టర్ బందరు పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పోర్ట్ అభివృద్ధి పనులు పరిశీలించారు. మొత్తం 1922 ఎకరాల్లో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులు గురించి ఆరా తీశారు. ముడ మాస్టర్ ప్లాన్ పరిశీలించి, చేపట్టవలసిన పనులు గురించి అడిగి తెలుసుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నిర్మిత ప్రాంతం పరిశీలించారు. బ్రేక్ వాటర్ ప్రాంతం, డ్రెడ్జింగ్ ప్రాంతం, అప్రోచ్ ఛానల్ ఏరియా వరకు వెళ్లి పరిశీలించారు. టర్నింగ్ సర్కిల్ ఏరియా, ప్రతిపాదిత పైలాన్ ఏరియా,పోర్టు నిర్మిత ప్రాంతం మార్కింగ్, బౌండరీలు పరిశీలించారు. 


ఈ సందర్భంగా కలెక్టర్ పి. రాజాబాబు  మాట్లాడుతూ, బందరు పోర్టు నిర్మాణానికి అవసరమైన భారీ యంత్రాలు, మెటీరియల్ తరలించుటకు అనువుగా పోర్టు కనెక్టివిటీ రహదారి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఈ పనులు ఇంకా వేగవంతం చేయాలని సూచించారు. 


వచ్చే నెలలో ముఖ్యమంత్రి పోర్టు పనులు ప్రారంభించేందుకు అంగీకరించారని, దీంతో పోర్టు సన్నద్ధత పనులు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పోర్టు పనులకు భూమి పూజ నిర్వహించిన అనంతరం పోర్టు నిర్మాణ పనులు సమీపంలో బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. పైలాన్ నిర్మాణం, ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేసే ప్రాంతం, సభా వేదిక తదితర ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు.  పోర్టు నిర్మాణ పనులు మొదలు పెట్టుటకు అవసరమైన భారీ యంత్రాలను నిర్మాణ సంస్థ ఇప్పటికే తరలించిందని, ముఖ్యమంత్రి పోర్ట్ పనులు లాంఛనంగా ప్రారంభించగానే, నిర్మాణ పనులు మొదలవుతాయని తెలిపారు. అనంతరం తవిసిపూడిలోని పోలీస్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు


ఏపీ  మ్యారీటైం బోర్డు ఎండి విద్యాశంకర్, ముడ విసి రాజ్యలక్ష్మి, మేఘా ఇంజనీరింగ్ జనరల్ మేనేజర్ తులసీదాస్, రైట్స్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ సూర్య, ఆర్డీవో ఐ కిషోర్, బందరు తాహిసిల్దార్ డి సునీల్ బాబు, రైట్స్ సంస్థ ప్రతినిధులు, వెంట ఉన్నారు.


Comments