*నారా లోకేష్ సహకారంతో శిక్షణ పొందిన 35 మందికి కుట్టుమిషన్లు పంపిణీ
*
*తాడేపల్లి పట్టణ, రూరల్ మండలాల్లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు, కుట్టుమిషన్లు పంపిణీ*
*స్త్రీ శక్తి పథకం కింద 60 రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న 2వ బ్యాచ్*
*10 బ్యాచ్ ల ద్వారా ఇప్పటి వరకు 350కు పైగా కుట్టుమిషన్లు అందజేత*
మంగళగిరి, ఏప్రిల్ 15 (ప్రజా అమరావతి): నియోజకవర్గంలోని మహిళల స్వయం ఉపాధి కల్పన కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కృషి చేస్తున్నట్లు నియోజకవర్గ తెలుగుమహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి తెలిపారు తెలిపారు. మంగళగిరి పట్టణంలోని ఎమ్మెస్సెస్ భవన్ లో తాడేపల్లి పట్టణం, రూరల్ మండలాల్లో కుట్టు మిషన్ కోర్సులో 60 రోజుల పాటు శిక్షణ పొందిన రెండవ బ్యాచ్ 35 మంది మహిళలకు కుట్టుమిషన్లు, సర్టిఫికేట్లను నియోజకవర్గ తెలుగు మహిళ విభాగం అధ్వర్యంలో శనివారం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుధ్ర భూలక్ష్మి మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేయడమే లక్ష్యంగా స్త్రీ శక్తి పథకంను నారా లోకేష్ ప్రారంభించినట్లు తెలిపారు. నియోజవర్గ మహిళలకు స్త్రీ శక్తి పథకం ఎంతగానో దోపదపడుతుందన్నారు. కుట్టు మిషన్లు అందుకున్న వారు స్వతహాగా ఎదుగుతూ వారి కుటుంబానికి, నారా లోకేష్ గారికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తాడేపల్లి పట్టణం, రూరల్ మండలాల్లోని మహిళలకు రెండు బ్యాచ్ లు ద్వారా 70 కుట్టు మిషన్లు అందించగా, ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గంలో 10 బ్యాచ్ లు ద్వారా 350 మందికి పైగా కుట్టుమిషన్లు నారా లోకేష్ గారి సహకారంతో వివిధ వర్గాల మహిళలకు ఉచితంగా అందించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు స్త్రీ శక్తి పథకంను సద్వినియోగం చేసుకున్న మహిళలు వారి కుటుంబాలకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారన్నారు. నారా లోకేష్ ఇస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేమని మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్వయం ఉపాధి కోసం లోకేష్ ఉచితంగా అందజేసిన కుట్టు మిషన్లు తమకు జీవనాధారంగా ఉంటాయని వారు అన్నారు. ఈ సందర్భంగా వారు నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానికి దేవి, నియోజకవర్గ తెలుగు మహిళ కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, తాడేపల్లి పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలు అన్నె కుసుమ, తాడేపల్లి మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు బొర్రా కృష్ణవందన, మంగళగిరి మండల తెలుగుమహిళ ప్రధాన కార్యదర్శి అప్పల శాంతి, టి.ఎన్.వి మల్లిక, వై లక్ష్మి, రమణ, నియోజకవర్గ తెలుగుమహిళ నాయకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment