నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీ కింద రూ.36 కోట్ల రూపాయలను నియోజక వర్గ పరిధిలోని అర్హులందరికీ అందించడం జరిగింది.

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీ కింద రూ.36 కోట్ల  రూపాయలను  నియోజక వర్గ పరిధిలోని అర్హులందరికీ అందించడం జరిగిందని  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్,  ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పేర్కొన్నారు.


మంగళవారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం,  ముసునూరువారిపాలెం   పంచాయతీ పరిధిలోని దేవరదిబ్బ, పైనాపురం గ్రామాల్లో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి పెద్ద ఎత్తున  మహిళలు, అభిమానులు,  ప్రజలు  అపూర్వ  స్వాగతం పలికారు. అనంతరం మంత్రి  గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ,  వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు.  


ఈ సంధర్బంగా  మంత్రి  శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అర్హత కల్గిన ప్రతి పేద కుటుంబానికి  సంక్షేమ కార్యక్రమాలు అందించడమే లక్ష్యంతో   రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు   గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబం వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలు ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల  పట్ల  సంతృప్తిని వ్యక్తం  చేస్తున్నారని మంత్రి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సుదీర్ఘంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.   ముత్తుకూరు మండల పరిధిలో  అనేక పరిశ్రమల స్థాపన జరిగినందున  ఈ ప్రాంత  ప్రజల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.  స్థానిక ప్రజలు కోరిన విధంగా  గ్రామాల్లో అబివృద్ది కార్యక్రమాలను చేపట్టుట జరుగుచున్నదన్నారు.  ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీ కింద రూ 36 కోట్ల  రూపాయలను  నియోజక వర్గ పరిధిలోని  అర్హులందరికీ అందించినట్లు మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో  ప్రజలు కోరుకున్న  అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా,  సంపూర్ణంగా అమలు చేయడం  జరుగుతుందని మంత్రి తెలిపారు.


మంత్రి వెంట   ఎంపిపి శ్రీమతి సుగుణమ్మ, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధిలు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Comments