రూ.5 కోట్ల తో నిర్మించనున్న కుప్పం పురపాలక సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి.



కుప్పం నియోజకవర్గం లో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన  


రూ.5 కోట్ల తో నిర్మించనున్న కుప్పం పురపాలక సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి



శాంతిపురం మండలం సోన్నేగానిపల్లిలో గ్రామ సచివాలయ భవనాన్ని, ఆర్ బి కే భవనానికి ప్రారంభో త్సవం చేసిన మంత్రి


 

శాంతిపురం మండలం నందు ఒక కోటి 18 లక్షల  తో పలు అభివృద్ధి కార్యక్రమా లకు ప్రారంభోత్సవా లు గావించిన మంత్రి


అనంతరం జెడ్పీ  విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి సంబందికులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు 


మొత్తం 42 మందికి కారుణ్య నియామకం...వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


కుప్పం, ఏప్రిల్ 27 (ప్రజా అమరావతి):


 ఎన్నికల హామీల్లో 98.44 శాతం ఎన్నికల హామీలు సిఎం శ్రీ వైఎస్ జగన్ నెరవేర్చారని రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి డా.పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డిపేర్కొన్నారు.



గురువారం మంత్రి కుప్పం నియోజక వర్గంలో శాంతిపురం మండలం మరియు కుప్పంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు.


ఈ కార్యక్రమాల్లో చిత్తూరు పార్ల మెంటు సభ్యులు ఎన్.రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు,రెస్కో   చైర్మన్ సెంథిల్  కుమార్, మున్సిపల్ చైర్మన్ సుధీర్ జెడ్పి సీఈఓ ప్రభాకర్ రెడ్డి, కమిషనర్ నరసింహ ప్రసాద్ఇతర  సంబం ధిత అధికారులు ఎంపీపీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు.


కుప్పంలో...


 1.రూ.5 కోట్లతో కుప్పం పురపాలక సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ


2. మున్సిపల్ పరిధిలో సచివాలయ భవనం నకు ప్రారంభోత్సవం


3. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం నకు  భూమి పూజ.


4. ప్రెస్ క్లబ్ నకు, రాజన్న క్యాంటీన్ కు ప్రారంభోత్సవం


శాంతిపురం మండలం  లో ఒక కోటి 18 లక్షలతో ప్రారంభోత్సవాలు


1. శాంతిపురం మండలం సోన్నే గారిపల్లిలో 25 లక్షలతో సచివాల యం 21.8 లక్షలతో ఆర్.బి.కె .


2. దండు కుప్పంలో రూ.17.57 లక్షలతో బి ఎం సి యూ,రూ.15 లక్షల తో  ఎఫ్ పి ఓ  భవనం 


3. చౌడంపల్లి లో రూ.20 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనం


4. నల్లరాలపల్లిలో రూ.15 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనం, రూ.2.5 లక్షలతో నిర్మించిన రచ్చ బండ,రూ.3 లక్షల తో నిర్మించిన కోదండరామస్వామి ఆలయము ఆర్చి నకుప్రారంభోత్సవాలు..



ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ..


రాష్ట్ర ముఖ్యమంత్రి   వైఎస్ జగన్మోహన్ రెడ్డి 31 లక్షల మంది కి ఇళ్ళ పట్టాలు అందించారని,ఇప్పటికే ఎన్నికల హామీ ల్లో 98.44 శాతం ఎన్నికల హామీలు  నెరవేరుస్తున్నారని, విద్యాసంక్షేమంలో భాగంగా అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, మనబడి నాడు-నేడు తదితర పథకాలు అమలు జరుగుతున్నదని,

కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కలవని,

మరోపక్క ఆసుపత్రు ల్లో కూడా ఇప్పటికే 40 వేల మందికి పైగా సిబ్బందిని నియమించారన్నారు.పేదరికాన్ని కొల మానం గా తీసుకుని అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పథకాలు అందిస్తున్నామని తెలిపారు.

Comments