శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి):
వైభవంగా ప్రారంభమైన చైత్ర మాస బ్రహ్మోత్సవములు:
దేవస్థానం నందు ది.01-04-2023, శ్రీ శోభకృత్ నామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి నుండి ది.05-04-2023, చైత్ర బహుళ చతుర్థశి తత్కాల పౌర్ణమి వరకు నిర్వహించు బ్రహ్మోత్సవములలో భాగముగా ఈరోజు అనగా శ్రీ శోభకృత నామ సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున ఉ.08 లకు చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానం నందలి బాలాలయము వద్ద ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ ప్రధానార్చకులు మరియు ఆలయ అర్చక సిబ్బందిచే పూజలు నిర్వహించి శ్రీ గంగా దుర్గ మల్లేశ్వర స్వామి వార్లకు శాస్త్రోక్తంగా మంగలస్నానములాచరింపజేసిన అనంతరం వధూవరులుగా అలంకరింపజేయడం జరిగినది.
ఈ కార్యక్రమము నందు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ , ట్రస్ట్ బోర్డు సభ్యులు బుద్దా రాంబాబు, చింతా సింహాచలం, బచ్చు మాధవీ కృష్ణ, నిడమానూరి కల్యాణి పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ దంపతులు, కార్యనిర్వాహనాధికారి వార్లు అమ్మవార్లకు, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
అనంతరం సా. 04గం.లకు శ్రీ విగ్నేశ్వర స్వామి వారికి పూజ, పుణ్యాహవచనము, అంకురార్పణ, అఖండ దీప స్థాపన, కళాశారాధన, బలిహరణ, అగ్ని ప్రతిష్టాపన మరియు ధ్వజారోహణం కార్యక్రమములు నిర్వహించడం జరుగును.
సా.5 గం. లకు వెండి పల్లకీ సేవ మల్లిఖార్జున మహమండపం నుండి నిర్వహించబడును.
addComments
Post a Comment