సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై మంచిఫలితాలు సాధించాలి

 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై  మంచిఫలితాలు సాధించాలి


  జిల్లాలోని అన్ని శాఖల హెచ్ ఓ డి లు  కచ్చితంగా స్థానిక ప్రధాన కేంద్రంలో నివాసం ఉండాలి


కార్యాలయంలోని  ప్రతి ఫైలు  ఉత్తర  ప్రత్యుత్తముల కొరకు ఈ ఆఫీసు నందు   నమోదు ప్రక్రియ  చేపట్టాలి


జిల్లా కలెక్టర్  పి . అరుణ్ బాబు




పుట్టపర్తి, ఏప్రిల్,15 (ప్రజా అమరావతి):  సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై మన జిల్లా మంచి ఫలితాలు సాధించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు.     శనివారంస్థానిక  కలెక్టరేట్లోని  కలెక్టర్ ఛాంబర్ నందు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై  సంబంధిత శాఖ అధికారులతో  జిల్లా కలెక్టర్ పి అరుణ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యామిలీ పిజినెస్ విధానం ద్వారా ప్రతి డాక్టర్ సెల్ నంబర్ డిస్ప్లే లో ప్రదర్శించాలని  జిల్లా వైద్య శాఖ అధికారి ఆదేశించారు.  ఓపి సంఖ్య పెంచాలని తెలిపారు. అన్ని ప్రభుత్వాసుపత్రులలో ప్రజలకు నాణ్యమైన వైద్య అందించాలని తెలిపారు, కంటి వెలుగు, ఫీవర్ సర్వే నమోదు ప్రక్రియ 100% సంబంధిత ఏఎన్ఎం ల ద్వారా  నమోదు ప్రక్రియ  చేపట్టాలని తెలిపారు. జిల్లా శ్రీ  శిశు  సంక్షేమ  శాఖ  ఆధ్వర్యంలో  ప్రతి అంగన్వాడి కేంద్రాన్ని బలోమితం చేయాలని icds pd  నీ ఆదేశించారు. ప్రతి సిడిపిఓ క్షేత్రస్థాయిలో అంగన్వాడి కేంద్రాల  తనిఖీలు చేయాలని తెలిపారు. త్వరలో క్షేత్రస్థాయిలో నా పర్యటన ఉంటుందని. ప్రతి అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. వైయస్సార్ సంపూర్ణ పోషణ,  వైఎస్ఆర్ కిట్టు, నిత్యవసర సరుకులు నిల్వ   పలు అంశాలపై ఆరా తీశారు, పిల్లలకు ఆధార్ అప్డేట్స్ 100% నమోదు చేయాలని తెలిపారు. సచివాలయాలలో ప్రత్యేక ఆధార్ అప్డేట్ కేంద్రాలు  ఏర్పాటు చేయుచున్నామని తెలిపారు. బరువు తగ్గిన పిల్లలకు గుర్తించి  వారికి పౌష్టికమైన ఆహారం అందజేయాలని  పేర్కొన్నారు. వివిధ సంక్షేమ వసతి గృహాలను విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందజేయాలని, సంక్షేమ శాఖ వసతి అధికారులు  ఆదేశించారు. వసతి గృహాలు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి వారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం  నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలోని కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తముల కొరకు  ఈ ఆఫీసులోనే  కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో DMHO  ఎస్ వి కృష్ణారెడ్డి, డి సి హెచ్ ఓ  తిపేంద్ర నాయక్, బీసీ  సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, ఐ సి డి ఎస్ పి డి లీల కుమారి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివ రంగ ప్రసాద్, గిరిజన సంక్షేమ అధికారి మోహనరావు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ప్రతాప్ రెడ్డి, శంకర్ రెడ్డి, సిపిఓ విజయ్ కుమార్, జి ఎస్ డబ్ల్యూ  నోడల్ ఆఫీసర్ శంకర్ రెడ్డి, కోఆర్డినేటర్ హిమవాణి, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments