నిరాదరణకు గురైన బాలల కోసంమిషన్ వాత్సల్య పథకం జిల్లా కలెక్టర్ బసంత కుమార్

 నిరాదరణకు గురైన బాలల కోసంమిషన్ వాత్సల్య పథకం

 జిల్లా కలెక్టర్ బసంత కుమార్

 

 పుట్టపర్తి, ఏప్రిల్ 8 (ప్రజా అమరావతి):

నిరాదరణకు గురైన బాలల ను ఆదుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకం నీ ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

 జిల్లాలో అనాధలుగా ఉన్న బాలలు, తల్లిదండ్రులను కోల్పోయిన వారు, తల్లితండ్రులకు దూరమైన వారు, తల్లి లేక తండ్రిని కోల్పోయిన వారు వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదాకుటుంబంవదిలివేసిన తల్లి యొక్క పిల్లలు అనాధ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసినివసిస్తున్న అనాధ బాలలు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రులు పిల్లలు ఆర్ధికంగా, శారీరకంగా పిల్లలను పెంచలేని నిస్సహాయ తల్లిదండ్రులు పిల్లలు  పై పథకానికి అర్హులుగా పేర్కొన్నారు


ఎవరైనా పిల్లలు 0 నుండి 18 సంవత్సరాల వయసు మధ్య గల పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు లేని పిల్లల ఆర్థిక లేదా ఇతర అనగా పిల్లల వైద్య విద్య మరియు అభివృద్ధి అవసరాలు తీర్చడానికి కొంత సహాయం అందించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం అయినటువంటి మిషన్ వాత్సల్య స్కాలర్ షిప్ అందించడం జరుగుతుంది. ఇది కొన్ని షరతులతో కూడుకొని ఉంటుంది. ఈ స్పాన్సర్ షిప్ ద్వారా పిల్లలకు నెలకు 4000 రూపాయలు అందించడం జరుగుతుంది.ఈ పథకము కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఒక కుటుంబం లో ఇద్దరు పిల్లల వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న బాలలు ఆయా క్యాటగిరీల ఆధారంగా ఉన్నట్టు గుర్తిస్తే ఆయా ప్రాంతాలకు చెందిన గ్రామ మహిళ కార్యదర్శి, అంగనవాడి కార్యకర్త, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు దరఖాస్తులను పూర్తి చేసి  జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయమునకు ఈనెల 15వ తేదీన దరఖాస్తులు సమర్పించుకోవాలని పై ప్రకటనలో తెలిపారు

 *మిషన్ వాత్సల్యకు దరఖాస్తు కావాల్సిన డాక్యుమెంట్ లు ఏమిటి?*


 బాలుడి లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం

 బాలుడి లేదా బాలిక ఆధార్ కార్డు

 తల్లి ఆధార్ కార్డు

 తండ్రి ఆధార్ కార్డు

 తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రము,మరణ కారణము

 గార్డియన్ ఆధార్ కార్డు

 రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డు

 కుల ధ్రువీకరణ పత్రము

 బాలుడి లేదా బాలిక పాస్ ఫోటో

 స్టడీ సర్టిఫికేట్

 ఆదాయ ధ్రువీకరణ పత్రము

 బాలుడి లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ ఎకౌంటు లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసిన జాయింట్ అకౌంట్.

 పై ప్రకటనలు తెలిపారు


 

Comments