రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన ఉద్దేశ్యంతో మరియు రైతులకు మేలు చేసే లక్ష్యంతో ఫూల్ ప్రూఫ్ మెకానిజం ఎండ్ టు ఎండ్‌తో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింద
ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.
సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, తూర్పుగోదావరి జిల్లాలో రబీ 2022-23 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 2.50 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ రోజు నాటికి అంటే 17.04.2023 నాటికి 276 మంది రైతుల నుంచి 2112.090 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కూపన్ లను జనరేట్ చెయుట జరిగిందన్నారు. ముగ్గురు రైతుల నుండి 14.360 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యడం జరిగినది.
రైతులు తమ ఉత్పత్తులను 17% తేమ వరకు ఆరబెట్టుకొని, వారి ధాన్యమును విక్రయించడానికి తేదీ మరియు సమయాన్ని షెడ్యూల్ చేయడానికి ఆర్భికే సిబ్బందికి తెలియజేయడం ద్వారా అవసరమైన గోనె సంచులను పొందవచ్చునని తెలిపారు. ఇందుకుగాను జిల్లాకు అవసరమగు గోనె సంచులకు గాను ఇప్పటికే 31% గోనె సంచులు 233 ఆర్‌బికేల నందు చేర్చడం జరిగినది.
రైతులకు గోనె సంచులు వినియోగ ఛార్జీలు @ రూ. 3.39 Ps., హమాలీ ఛార్జీలు @ రూ 22/- చెల్లించబడును . ధాన్యం కొనుగోలు విషయమై ఏవైనా సందేహాల మరియు ఫిర్యాదులు కొరకు జిల్లా కార్యాలయం 8309487151 మరియు 08832940788 వద్ద కంట్రోల్ రూమ్‌ను ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు సంప్రదించాలని పేర్కొన్నారు. డివిజన్, మండల స్థాయి లో కూడా కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.
addComments
Post a Comment